విశేష రాజయోగాలతో నేటి నుండి వీరికి అఖండ ధనయోగం!
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా ప్రజలు చాలా విశేషంగా జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన ఈ సంవత్సరం ఐదు విశేష యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అరుదైన రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అఖండ ధనలాభం కలుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చంద్రుడు వృషభ రాశిలోకి సంచరిస్తూ ఉండడం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది.
కృష్ణాష్టమి నాడు విశేష రాజయోగాలు
సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడుతుంది. అలాగే నేడు రోహిణి నక్షత్రంతో హర్షణయోగం, ఇక నేడు అష్టమి తిధి కావడంతో శివవాసయోగం ఏర్పడుతుంది. బృహస్పతి చంద్రుల కలయిక వల్ల నేడు గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ శుభయోగాల కారణంగా ఏర్పడుతున్న విశేష యోగాలతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుని అనుగ్రహంతో పాటు ఏర్పడుతున్న ఐదు రాజయోగాల కారణంగా మేషరాశి జాతకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతం అవుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారి జీవితంలో స్థిరత్వం ఉంటుంది. వృషభ రాశి జాతకులు ఉద్యోగం చేసే చోట గౌరవాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంది.
సింహరాశి
సింహ రాశి వారికి నేటి నుండి జాతకం బాగుంటుంది. మీ సామాజిక పేరు ప్రతిష్టలు ఈ సమయంలో పెరుగుతాయి. నూతన వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులను కలవడం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. సింహరాశి వారి ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది.
తులా రాశి
తులారాశి వారు నేటి నుండి మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నేటి నుండి ఏ పని చేసినా కలిసివస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేటి నుంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే అవకాశం లభిస్తుంది. అనేక నూతన ఆదాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications