మరికొద్ది గంటల్లో గజకేసరి రాజయోగం.. మూడు రాశులకు పట్టిందల్లా బంగారం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వల్ల అనేక యోగాలు ఏర్పడతాయి. అందులో కొన్ని శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలు. అక్టోబర్ 28వ తేదీన చంద్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడే ఖగోళ సంఘటన నేపథ్యంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
గజకేసరి రాజయోగంతో వారికి పట్టిందల్లా బంగారమే: చంద్రుడు బృహస్పతి గజకేసరి రాజయోగంతో మొత్తం 12 రాశులు ఏదో ఒక విధంగా ప్రభావితం అవుతాయి. అయితే మూడు రాశుల వారికి మాత్రమే అదృష్టం వరిస్తుంది. మూడు రాశుల వారికి గజకేసరి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది. అక్టోబర్ 28వ తేదీన చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక బృహస్పతి కూడా అదే రాశిలో ఉంటాడు .ఈ సమయంలో మేషరాశిలో బృహస్పతి చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.

మేష రాశి: గజకేసరి యోగం వల్ల మేష రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. మేషరాశి జాతకుల వ్యాపారం లాభదాయకంగా మారుతుంది. కొత్త ఒప్పందాలు, వ్యాపారాలు కొనసాగించడానికి ఇది అనుకూలమైన సమయం. మేషరాశి జాతకుల వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వివిధ వనరుల ద్వారా ఆర్థికలాభాలు పొందేందుకు ఇది సరైన సమయం. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు .ఈ సమయంలో ఒత్తిడి నుంచి మీరు బయటపడతారు.
మిధున రాశి: మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తెస్తుంది. వీరు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలను పొందుతారు. కొత్త వ్యాపార భాగస్వాములకు సరైన అవకాశం ఏర్పడుతుంది. వృత్తిపరమైన, వ్యాపార అవసరాల కారణంగా మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారు శక్తివంతులు గానూ, ఆరోగ్యంగానూ ఉంటారు. వీరు అనుకున్నవన్నీ సులభంగా నెరవేర్చుకోగలుగుతారు.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల బాగా లాభిస్తుంది. కర్కాటక రాశి వారు కొత్త పనిని విజయవంతంగా ప్రారంభించడానికి, దాని నుంచి లాభాలను ఆర్జించడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇది ఆర్థికంగా ప్రయోజనాలను చేకూర్చే సమయం. వైవాహిక జీవితం తృప్తిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో జీవితంలో ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలో కొత్త ఉద్యోగాలలో చేరే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications