గజకేసరి యోగం: ఈ రాశులవారికి అదృష్టానికి బదులు దురదృష్టం; జాగ్రత్త!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన యోగాలలో గజకేసరి యోగం ఒకటి . ఇది మహారాజ యోగాలలో ఒకటిగా పేర్కొనబడింది. బృహస్పతి మరియు చంద్రుడు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు లేదా ఒకదానికొకటి ప్రత్యక్షంగా కనిపించినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. అయితే ఈసారి గజకేసరి యోగం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తుంది. బృహస్పతి రాహువు, కేతువుతో కలిసి చంద్రునితో కలిసినప్పుడు గజకేసరి యోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.

గజకేసరి యోగం వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనబోయే ఆ రాశులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. గజకేసరి యోగం కారణంగా మేష రాశి వారికి శుభ ఫలితాలకు బదులు అశుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి జాతకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఈ సమయంలో లోనవుతారు. తల్లి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కుటుంబ మరియు వివాహ జీవితాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. వివాహం విచ్చిన్నం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

Gajakesari Yoga: unluck instead of luck for these signs; Be careful!!

కర్కాటక రాశి జాతకులకు కూడా గజకేసరి యోగం ఈసారి అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. ఇక్కడ చంద్రుడు కేతువుతో కలిసి ఉండటం వల్ల కుటుంబ వాతావరణం లోనూ, వృత్తి జీవితంలోనూ ఆటంకాలు ఏర్పడతాయి. ఉన్నతాధికారులతో మీకు సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా లేకపోలేదు. మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. తల్లి ఆరోగ్యం సమస్య అధికంగా ఉంటుంది. ఇది మీకు మరింత ఆందోళన కలుగజేస్తుంది.

గజకేసరి యోగం వల్ల ధనుస్సు రాశి జాతకులు ఈసారి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తిపరమైన జీవితంలో మోసపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలను ప్రేమ జీవితానికి సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల వల్ల ఇబ్బంది పడతారు. మీ శ్రమను గుర్తించక పోగా, మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా ఉన్నతాధికారుల ప్రవర్తన ఉంటుంది.

గజకేసరి యోగం వల్ల తులా రాశి జాతకులకు సత్ఫలితాలు రావు. తులారాశి జాతకులు ఈ సమయంలో వివాహం చేసుకోవడం మంచిది కాదు. ఇది వివాహంలో ప్రతికూలతలను, సంఘర్షణను కలుగజేస్తుంది. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+