గురు-శుక్ర సంయోగంతో గజలక్ష్మి యోగం.. మూడు రాశులవారికి అఖండ ధనయోగం
గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడం, గ్రహాల సంయోగం కారణంగా వివిధ యోగాలు ఏర్పడతాయి. మే నెలలో వృషభ రాశిలోకి బృహస్పతి మే ఒకటవ తేదీన మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాలకు ప్రవేశించింది. ఇక మే 19వ తేదీన వృషభ రాశిలోకి శుక్రుడు కూడా ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో గురు శుక్రుల కలయిక వల్ల అద్భుతమైన యోగం గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది.
గజలక్ష్మీ యోగంతో మూడు రాశులవారికి లబ్ది
ఈ గజలక్ష్మి యోగం కారణంగా మూడు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం వల్ల ధన యోగం కలుగుతుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా ఫలితం మాత్రం సానుకూలంగానే ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
గజలక్ష్మి యోగం కారణంగా మేషరాశి వారి జీవితాలలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గురు శుక్ర సంయోగం వల్ల మేషరాశి జాతకుల ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో మేష రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆదాయ వనరులు పెరిగి మేష రాశి జాతకులకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సింహరాశి
గజలక్ష్మి యోగం కారణంగా సింహరాశి వారి జీవితాలలో శుభ ఫలితాలు రానున్నాయి. సింహరాశి వారి వైవాహిక జీవితం ఆశాజనకంగా ఉంటుంది. దంపతుల మధ్య ప్రేమ, పరస్పర సాన్నిహిత్యం చోటు చేసుకుంటుంది. సింహరాశి జాతుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు. మీరు ఈ సమయంలో లక్ష్మీదేవితో ఆశీర్వదించబడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది.
మకర రాశి
గజలక్ష్మి యోగం కారణంగా మకర రాశి జాతకులకు అన్ని శుభాలే కలుగుతాయి. గురు శుక్ర గ్రహాల కలయిక వల్ల మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వర్తక వ్యాపారాలలో లాభాలు సంపాదించడానికి సరైన సమయం. ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఏది మాట్లాడినా, ఏది చేసినా అందరికీ నచ్చుతుంది. ఎంతోకాలంగా రాకుండా నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంపన్నమైన జీవితాన్ని గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications