దసరా శరన్నవరాత్రులలో ఈ రాశులవారికి సంపదలను ప్రకటించిన దుర్గాదేవి!

ఆశ్వయుజ మాసంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. దసరా శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని భక్తులందరూ పూజిస్తారు. ఈ సమయంలో దుర్గాదేవి భూమి మీద ఉన్న భక్తులను కటాక్షించేందుకు వస్తుందని చెబుతారు. అయితే ఆశ్వయుజ మాసంలో గ్రహ సంచారం,రాశులలో గ్రహాల స్థానాన్ని బట్టి శరన్నవరాత్రుల సమయంలో కొన్ని రాశుల వారికి శుభాలు జరుగుతున్నాయి. నవరాత్రులలో కొన్ని రాశులు అదృష్టాన్ని పొందబోతున్నాయి .

మేష రాశి
దుర్గా శరన్నవరాత్రులు సమయంలో మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమయం మీ జీవితంలో చాలా సంతోషకరమైన రోజులను తెస్తుంది.

Goddess Durga will bless these zodiac signs with wealth during Dussehra navratri

వృషభ రాశి
దుర్గా శరన్నవరాత్రులు వృషభ రాశి జాతకులకు చాలా ప్రయోజనాలను ఇస్తాయి. దుర్గాదేవి కటాక్షం ఈ సమయంలో వీరిపై బాగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి సంపదలు పెరిగే అవకాశం ఉంది. పెళ్ళికాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది.

సింహరాశి
దుర్గా శరన్నవరాత్రుల సమయంలో సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహ రాశి కి చెందిన రాజకీయ రంగానికి చెందినవారు అధికారిక పదవులను పొందుతారు. ఈ సమయంలో ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. సింహ రాశి వారు తమ రంగాలలో విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి
దుర్గా శరన్నవరాత్రులలో వృశ్చిక రాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి పూర్తి మద్దతుని ఇస్తుంది. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు అనుకూలమైన తీర్పులను ఇస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నిజంగా మంచి సమయంగా మారుతుంది.

కుంభరాశి
దుర్గా శరన్నవరాత్రులలో కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహితుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కుంభ రాశి వారి జీవితంలో ఉండే ప్రతికూలతలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+