2023లో ఈ రాశుల వారికి గురు చండాల యోగం; అన్నీ వైఫల్యాలే.. జాగ్రత్త!!
ఉగాది పండుగ రోజు నుండి చైత్ర నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఇక ఉగాది పండుగ నుండి గ్రహాలు రాశులు మారి, వివిధ జాతకుల జాతక చక్రాలు, రాశుల ఫలితాలు మారిపోయాయి. అయితే ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి గజకేసరి యోగం ఉండగా, మరికొన్ని రాశుల వారు గురుచండాల యోగంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. అత్యంత దుర్భరమైన, ప్రతికూల పరిస్థితులను వారు చవిచూడనన్నారు. అసలు గురు చండాల యోగం అంటే ఏమిటి? ఈ సంవత్సరం గురు చండాల యోగం ఎప్పుడు వస్తుంది? ఏ ఏ రాశుల వారి పైన గురు చండాల యోగ ప్రభావం ఉంటుంది? అది ఎంతకాలం వారిని ఇబ్బంది పెడుతుంది? వంటి వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
గురు చండాల యోగం ఈ రాశులపై ప్రభావం
గురు చండాల యోగం.. సరిగ్గా ఏప్రిల్ 22వ తేదీన, అంటే ఉగాదికి నెల రోజుల తర్వాత గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఆ సమయంలో బృహస్పతి, రాహువు మేషరాశిలో కలుస్తారు. మేష రాశిలో మొదట రాహువు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 22వ తేదీన మేషరాశి లోకి గురువు ప్రవేశిస్తాడు. మేషరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఇది అనేక ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఆయా రాశులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సంవత్సరం గురు చండాల యోగం ప్రభావం ముఖ్యంగా మేష రాశి పైన, మిధున రాశి పైన, ధనుస్సు రాశి పైన ప్రధానంగా కనిపిస్తుంది.
గురు చండాల యోగంతో ఫలితాలు ఇలా
ఇక గురు చండాల యోగం ఏర్పడినప్పుడు మనిషిలో ఉండే మంచి లక్షణాలు తగ్గిపోయి అన్ని ప్రతికూల లక్షణాలు కనిపిస్తాయి. గురు చండాల యోగం ప్రభావంతో అనుకున్నవి ఏవి జరగవు. ఈ సమయంలో వ్యక్తి ఎక్కువగా బలహీనపడిపోతాడు . జీర్ణ వ్యవస్థ, కాలేయ సమస్యలు మొదలైన వ్యాధులకు గురవుతాడు. ఒక్కొక్కసారి గురు చండాల యోగం ప్రభావంతో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇక గురు చండాల యోగం స్త్రీ జాతకంలో ఉంటే, ఆ స్త్రీ జీవితం నరకంగా ఉంటుంది.

మేషరాశి
గురు చండాల యోగంతో మేషరాశి జాతకులకు ఏప్రిల్ 22 తర్వాత ఆరు నెలల కాలం చాలా కష్టంగా ఉంటుంది. మీరు చేసే అన్ని పనులలోను ఆటంకాలు ఏర్పడతాయి. విపరీతమైన చిరాకును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఏప్రిల్ 22 నుండి, అక్టోబర్ 22 వరకు మేష రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మిథునరాశి
మిధున రాశి జాతకులకు గురు చండాల యోగం ప్రభావంతో ఆరు నెలల పాటు నరకం కనిపిస్తుంది. ఈ సమయంలో వారు చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది . పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడం చిరాకు కలిగిస్తుంది. ఈ సమయంలోనే సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి గురు చండాల యోగం ప్రభావం ఆరు నెలపాటు ఇబ్బంది పెడుతుంది. వీరు డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారంలో నష్టాలకు చాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. తెలియని భయంతో ఆందోళనకు గురవుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అడుగడుగునా సమస్యలకు అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications