మరికొన్ని గంటల్లో గురుపుష్య యోగం: ఈ పనులు చేస్తే లక్ష్మీకటాక్షం!!
జ్యోతిష శాస్త్రంలో గురు పుష్య యోగాన్ని అత్యంత ముఖ్యమైన యోగంగా పరిగణిస్తారు. ఈనెల 25వ తేదీ గురువారం నాడు గురు పుష్య నక్షత్రం వేళ గురు పుష్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడే యోగం. గురు పుష్య నక్షత్రంలో ఏర్పడే ఈ యోగం నాడు కొన్ని పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
వేద జ్యోతిషశాస్త్రంలో గురు పుష్య నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది అంగారక గ్రహానికి సంబంధించిన పనులకు అంటే పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలు, బంగారం మరియు వెండి కొనుగోలు మరియు సంపదను పొందడం వంటి వాటికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. 2024 సంవత్సరం మొదటి పుష్య నక్షత్రం రానున్న గురువారం రోజు రాబోతుంది. ఇది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.

గురు పుష్య నక్షత్ర సమయంలో చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుందని పండితులు చెబుతారు. గురు పుష్య నక్షత్ర సమయంలో గురు పుష్య యోగం ఏర్పడటం వల్ల ఇది అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం గురు పుష్య యోగం జనవరి 25వ తేదీ 2024 సంవత్సరం ఉదయం 8:16 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆపై ఇది జనవరి 26వ తేదీ ఉదయం 10:28 నిమిషాలకు ముగుస్తుంది.
ఈ సమయంలో మీరు షాపింగ్ తో పాటు ఇతర శుభకార్యాలను కూడా చేసుకోవడానికి వీలుంటుంది. గురు పుష్య నక్షత్రంలో చేసే కొన్ని పనులు శుభాలను చేకూరుస్తాయి. ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సు చాలాకాలం పాటు ఉంటుందని చెబుతారు. ఇది జ్ఞానాన్ని సంపాదించడానికి అనుకూలమైన సమయంగా కూడా చెబుతారు.
ఈ పవిత్రమైన రోజున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలి. సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంది. ఈరోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ రోజున మంత్రోచ్ఛారణలు, యంత్రాలు ఉపయోగించడం వంటివి చేయడానికి అనుకూల మైనటువంటి సమయం. ఈరోజు మతపరమైన ప్రదేశాలను సందర్శించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications