త్వరలో వీరికి హ్యాపీ డేస్.. మిధునంలో మూడు గ్రహాలు కలిసి ఇచ్చిన వరం!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట సమయం ప్రకారం సంచారం చేస్తాయి. ఇలా గ్రహాలు నుంచి మరొక రాశిలోకి సంచారం చేసే సమయంలో వేరే గ్రహాలతో కలిసి అనేక యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. ప్రస్తుతం ఆగస్టు నెలలో గురువు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నారు. బృహస్పతి ఒక రాశిలో 12 నెలలపాటు సంచారం చేస్తుంది.
మిధున రాశిలో బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు
ప్రస్తుతం మిధున రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. ఇక శుక్రుడు 23 రోజుల నుంచి 60 రోజుల వరకు ఒకే రాశిలో సంచారం చేస్తాడు. ప్రస్తుతం శుక్రుడు కూడా మిధున రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఆగస్టు 18వ తేదీన మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.

మూడు గ్రహాల కలయికతో లబ్ది పొందే రాశులు
రెండు రోజులపాటు ఆగస్టు 20వ తేదీ వరకు చంద్రుడు కూడా మిధున రాశి లోనే ఉంటాడు. ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది. మిధున రాశిలో ఆగస్టు మాసంలో మూడు గ్రహాలు కలయికతో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కర్కాటక రాశి
మిధున రాశిలో మూడు గ్రహాల సంయోగం కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని విధాలా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులు సంతోషంగా ఉంటారు. కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు మూడు గ్రహాల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఏ పని చేసిన లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు సంతోషంగా జీవించడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి.
తులారాశి
తులా రాశి వారికి మూడు గ్రహాల సంయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు కోరుకున్న ఉద్యోగాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు వివిధ వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుంటారు. తులా రాశి వారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఈ సమయం తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications