ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్తున్నారా? ఏ వారం ఏం పని చెయ్యాలో తెలుసుకోండి!!
వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిరోజు మనం బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని రకాల పనులను చేస్తే మంచి జరుగుతుందని చెబుతారు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని మాత్రమే చేయాలని చెబుతున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు వారాలను అనుసరించి ఏ రోజు ఏ పని చేయాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ఆదివారం రోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా జేబులో తమలపాకును పెట్టుకొని వెళ్లడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. సోమవారం రోజు మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంట్లోనుంచి బయటకు రావాలి. ఇంకా వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశద్వారం దగ్గర అమర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. సోమవారం రోజు అద్దాన్ని ముఖంలో చూసుకుని బయటకు వెళితే మంచి జరుగుతుంది.

హనుమంతునికి ఇష్టమైన వారం మంగళవారం. మంగళవారం నాడు ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠిస్తే అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకుంటే మంచిది. బెల్లం తిని బయటకు వెళితే మరి మంచిది. బుధవారం నాడు బయటకు వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులను నోట్లో వేసుకొని వెళ్లాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగాను, ఉపయుక్తంగా అని ఉంటుంది.
ఇక గురువారం రోజు బయటకు వెళ్లేటప్పుడు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమలకుండా అలాగే నోట్లో ఉంచుకోవాలి. బయటకు వెళ్లే వరకు అలానే ఉంచుకుంటే బయటకు వెళ్లినా పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఇక శుక్రవారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతి శుక్రవారం రెండు టేబుల్ స్పూన్ల పెరుగును ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తింటే మంచిది. శనివారం నాడు ఇంటి నుండి బయటకు వెళ్లాలి అనుకునే వారు కొద్దిగా అల్లం తురుము, నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ ఇంటికి వస్తాయని చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజుకూ ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని, పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర అభిప్రాయాలు,సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications