Horoscope today: ఇవ్వాళ వీరికి ఆకస్మిక ధనలాభం, తిరుగే లేని జీవితం!
డిసెంబర్ 3 2025 బుధవారం. ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంది? ఏ రాశి వారికి కలిసి వస్తుంది? ఏ రాశి వారు నేడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈరోజు గ్రహాల సంచారం వీరికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? అనేది తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారి ఆరోగ్యం ఈరోజు అంతంతమాత్రంగా ఉంటుంది. కుటుంబంలో చిరాకులు వస్తాయి. ప్రేమ సంబంధమైన వ్యవహారాలలోను వైఫల్యాలు కనిపిస్తాయి. వృత్తిపరమైన పనులలో సానుకూలత ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు నేడు వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త.
మిధున రాశి
మిధున రాశి వారి ఆరోగ్యం నేడు అంతగా బాగుండదు. డబ్బు విషయాలకు సంబంధించి కూడా నేడు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కుటుంబ విషయాలు, ప్రేమ విషయాలలో బాగానే ఉన్నప్పటికీ వృత్తిపరమైన చిరాకులు కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబంలో చిరాకులు కనిపిస్తాయి. ఆర్థికంగా నేడు బాగానే ఉన్నప్పటికీ వృత్తిపరమైన పనులలోను చిరాకులు కనిపిస్తాయి. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం అంతంతమాత్రంగా ఉంటుంది.
సింహరాశి
నేడు సింహ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా నేడు సింహ రాశి వారికి సానుకూలత కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రేమ విషయాలు, వైవాహిక బంధం చిరాకు పెడతాయి.
కన్యారాశి
నేడు కన్యా రాశి వారి ప్రతికూల ఫలితాలను చూస్తారు. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో చిరాకులు, ప్రేమ సంబంధాలలో చిరాకులు కనిపిస్తున్నాయి. వృత్తిపరమైన జీవితంలోను ఇబ్బందులు ఎదురవుతాయి.
తులా రాశి
తులారాశి జాతకులు నేడు డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. వృత్తిపరంగా సానుకూలతలు ఉన్నప్పటికీ తులా రాశి వారు కాస్త ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈరోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసేవారు మార్పులు చూస్తారు. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు డబ్బులు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు నేడు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వారికి నేడు కలిసొస్తుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
మకర రాశి
మకర రాశి జాతకులు డబ్బు పెట్టుబడి పెట్టే విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సమయంలో మకర రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలు, ప్రేమ విషయాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో సహనాన్ని కోల్పోకండి. పని ప్రదేశంలో వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు వివేకం తో, ధైర్యంగా ప్రవర్తించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మీన రాశి
మీనరాశి జాతకులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీనరాశి జాతకులు వృత్తిపరమైన విషయాలలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నేడు వీరికి ఆరోగ్యం బాగుంటుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications