horoscope today: గీతా జయంతి నేడు.. ఈ రాశుల తలరాతలు మారుతున్నాయ్!

డిసెంబర్ ఒకటి 2025 సంవత్సరం సోమవారం. ఈరోజు గీతా జయంతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశుల వారికి నేడు కలిసి వస్తుంది? ఏ రాశుల వారికి నేడు ప్రతికూలంగా ఉంటుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారు ఈ రోజు కాస్త రిలాక్స్ అవ్వవచ్చు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబ విషయాలకు అనుకూలమైన రోజు. ఎప్పటినుంచి పూర్తికాని పనులు ఈరోజు పూర్తవుతాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి స్వీయ అభివృద్ధి మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు మీరు సహాయం చేస్తారు. ఇంట్లో సున్నితమైన సమస్యలను ఈరోజు మీరు పరిష్కరిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

horoscope today Geeta Jayanti today The horoscopes of these zodiac signs are changing

మిధున రాశి
మిధున రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తోడబుట్టిన వారికి ఆర్థిక సహాయం చేస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారాలు చేసేవారు సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు నిర్లిప్తత, నిస్పృహకు లోను కాకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు, ఆర్థిక అభివృద్ధి కొరకు సమాచారం చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలపైన దశలవారీగా కష్టపడితే విజయం మీదే అవుతుంది.

సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు ధన నష్టాలు సంభవిస్తాయి. ఈరోజు సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

కన్యారాశి
కన్యా రాశి వారు నేడు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలలోను, ఆఫీసులను అన్ని సానుకూలంగానే ఉంటాయి.

తులారాశి
తులారాశి జాతకులు నేడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేడు తులా రాశి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రుల ఆందోళనకు కారణం కావొద్దు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి క్షణికావేశం అనర్ధాలను తీసుకువచ్చే ప్రమాదం ఉంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొరపాటున కూడా ఇతరులను కించపరిచే ప్రయత్నం చేయొద్దు ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నరాల పనితీరు దెబ్బ తీసే ప్రమాదం ఉంది. నేడు భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. పనిచేసే చోట ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది ధనుస్సు రాశి వారికి ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.

మకర రాశి
మకర రాశి వారికి పని పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నేడు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నం మీకు సత్ఫలితాలను ఇస్తుంది.

కుంభరాశి
కుంభ రాశి వారు మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మనసుకు నచ్చని పని కాకుండా మీకు ఇష్టమైన పని చేయడానికి కీలక నిర్ణయం తీసుకునే సమయం.

మీనరాశి
మీనరాశి జాతకులు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు భావోద్వేగ ఒత్తిడిని తట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది. భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాల కంటే ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. కనుక జాగ్రత్త.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+