Horoscope today: హోలీ నాడే చంద్రగ్రహణం: ఈ రాశులవారు శుభవార్తలు వింటారు!!
ఈరోజు హోలీ.. అంతే కాదు చంద్రగ్రహణం కూడా.. దేశ ప్రజలంతా హోలీ పండుగను జరుపుకోవడానికి సిద్ధమైన సమయం. ఈరోజు గ్రహాల గమనం వల్ల అనేక రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది. ఈరోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఎవరు ఇబ్బందులను ఎదుర్కొంటారు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
తులారాశి
తులా రాశి వారికి నేడు లాభదాయకంగా ఉంటుంది. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయితే తులా రాశి జాతకులు నేడు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. ఈరోజు వీరు శివుని ఆరాధిస్తే మంచిది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు నేడు శుభ ఫలితాలను అందుకుంటారు. ఈరోజు మీరు ఉత్సాహంగా గడుపుతారు. గతంలో పూర్తికాని పనులను కూడా ప్రస్తుతం పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి జాతకులు నేడు ఇష్ట దైవ నామాన్ని జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు మీ మీ రంగాలలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. చేసే పనిలో స్పష్టత నేడు పెరుగుతుంది. కీలక విషయాలలో పెద్దల సలహాలు, సూచనలతో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ధనుస్సు రాశి జాతకులు నేడు ఇష్ట దైవారాధన చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి జాతకులకు నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి జాతకులు చిత్తశుద్ధితో చేసే పనులు నేడు మంచి ఫలితాలను ఇస్తాయి. చంచల నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది పెడుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అనవసరమైన విషయాలలో తలదూర్చి ఇబ్బందులు పడకుండా ఉండాలని సూచించబడింది. నవగ్రహ ధ్యానం చేయడం సత్ఫలితాలను ఇస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు నేడు అష్టమ చంద్రుడు అనుకూలంగా లేడు. తోటి వారి సహకారంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు.తోటివారి సూచనలు ఉపయోగపడతాయి. చంద్రుడిని ధ్యానం చేయడం కుంభరాశి వారికి నేడు మంచి ఫలితాలను ఇస్తుంది.
మీనరాశి
మీనరాశి జాతకులకు బుద్ధిబలం బాగుంటుంది. మీనరాశి జాతకులు బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం వీరికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి జాతకుల ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. మీనరాశి జాతకులు నేడు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదంగా చెప్పబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH!












Click it and Unblock the Notifications