Horoscope today: నేడు వీరికి విలాసాల భాగ్యం.. ఖర్చులతో జాగ్రత్త!
డిసెంబర్ 2 2025.. ఈరోజు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి? నేడు ఏ రాశి వారికి కలిసి వస్తుంది? ఏ రాశి వారు ప్రతికూల ఫలితాలను చూస్తారు? ఏ రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది? కెరీర్లో పురోగతి ఉంటుంది? వంటి వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు విశ్రాంతి తీసుకునే రోజు. ఈరోజు ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి బాగుంటుంది. మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు నేడు ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగం చేసే వారికి నేడు బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండకపోతే నేడు వృషభ రాశి వారు నిరాశకు గురి కావలసి వస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేడు స్నేహితులతో విలాసాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఈరోజు ప్రేమ విషయంలో జాగ్రత్త. కెరీర్ విషయంలో మిధున రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు నేడు మితిమీరిన పనులను చెయ్యకుండా ఉండాలి. అదనపు పనులను ఈరోజు వాయిదాలు వేసుకుంటే మంచిది. ఘర్షణలకు దూరంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త.
సింహరాశి
సింహరాశి జాతకులు ఖర్చు చేస్తే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరుల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం మానుకోవాలి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్యారాశి
కన్యారాశి జాతకులు ఈరోజు ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. విందులు, వినోదాలు, విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేయకుండా ఉంటే మంచిది. పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి.
తులారాశి
తులారాశి జాతకులు నేడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు ఈరోజు చిరాకును కలిగిస్తాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం, ప్రేమ సంబంధిత వ్యవహారం బాగుంటుంది.
వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి వారికి సంపద బాగుంటుంది. ప్రేమ సంబంధిత వ్యవహారాలు, కుటుంబ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు నేడు ప్రతికూల ఫలితాలను చూస్తారు. ఈరోజు వీరికి అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి.
మకర రాశి
మకర రాశి వారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అనవసరమైన టెన్షన్ పడవద్దు. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త.
కుంభరాశి
కుంభరాశి వారికి నేడు ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా సానుకూలతలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కనుక జాగ్రత్త. వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం.
మీన రాశి
మీన రాశి వారికి నేడు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. పనిచేసే చోట సహోద్యోగుల మద్దతు లభించదు. వైవాహిక జీవితం బాగుంటుంది.












Click it and Unblock the Notifications