Horoscope today:నేడు వీరికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారా!
కొత్త సంవత్సరం రెండో రోజు అయిన జనవరి 2న గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్ని రాశులకు జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు ఇస్తోంది. జనవరి 2న ముఖ్య గ్రహాలైన సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం అంశాల్లో ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
మేషం
మేషరాశి వారికి ఈరోజు పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అవసరం. ఆర్థికంగా మోస్తరు లాభం ఉంటుంది.

వృషభం
వృషభ రాశి జాతకులకు ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి.
మిథునం
మిధున రాశి జాతకులు కొత్త సమాచారంతో లాభం పొందుతారు. కమ్యూనికేషన్ ద్వారా అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి పని ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కుటుంబ సహకారం లభిస్తుంది.
సింహం
సింహరాశి వారికి అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం.
కన్య
కన్యా రాశి జాతకులకు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
తుల
తులా రాశి వారికి భాగస్వామ్య వ్యవహారాల్లో లాభ సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. అన్ని విధాలా లాభం వస్తుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర వాదనలను దూరంగా పెట్టండి.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకుల కొత్త ఆలోచనలు అమలులోకి వస్తాయి. ప్రయాణ యోగం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
మకరం
మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. ఆర్థికంగా బలపడతారు.
కుంభం
కుంభ రాశి వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలసటకు దూరంగా ఉండాలి.
మీనం
మీన రాశి వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా క్రమంగా మెరుగుదల ఉంటుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications