• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాస్తు ప్రకారం ప్రహరీ గోడ, గేటు ఎలా ఉండాలి..ఇంట్లో అనర్థాలు జరగవు..!

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనం నివసించే ఇంటికి ప్రహరీ గోడ నిర్మాణం కొరకు వాస్తుశాస్త్ర సంబంధమైన ఏమైనా నియమాలు ఉంటాయా..? మనకు నచ్చిన కొలతలతో వాస్తు సూత్ర సంబంధం లేకుండా కట్టుకోవచ్చునా..? అనే సందేహం కల్గుతుంది. నివాసం కొరకు ఏర్పాటు చేసుకున్నఇంటికి ప్రహరీ గోడ అనేది ఆ ఇంటికి రక్ష కవచము లాంటిది. ముఖ్యంగా ఇంటికి కాంపౌండువాల్ నకు మధ్య ఏ దిశలోనూ ఎలాంటి గోడ తాకకూడదు.

కొంత మంది పొరపాటున ఇంటికి కాంపౌండువాల్ కు మధ్యలో మెట్లగోడ తాకేలా కట్టడం, పెంపుడు జంతువుల కోసం చిన్న ఇళ్లును రెండింటికి మధ్యలో లింక్ కలుపుతూ కట్టడం, వాచ్మెన్ కోసమని చిన్న రూమ్ అని, గెస్టుల కోసమని బాత్రుం కట్టడం లాంటివి చేస్తూ.. ఇంటికి కాంపౌండువాలుకు కనెక్షన్ కలిపేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. ఇలాంటి పొరపాట్లు చేస్తే అనేక ఆనర్ధాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శాస్త్రము మీద అవగాహణ లేకుండా ఏమౌతుందిలే అని వాస్తుకు విరుద్దంగా కట్టకండి, ఇబ్బందులు కొని తెచ్చుకోకండి.

* ఇంటి ప్రహరీ గోడ ఏ దిక్కులో ఎంత ఖాళీ స్థలం వదిలి కట్టాలి అనే అంశంలో ఇల్లు కట్టిన స్థలం నుండి చుట్టూ కొలతలు సూచాప్రాయంగా ఉదాహరిస్తున్నాను ఈ క్రింద తెలిపిన ప్రమాణంలో కాంపౌండువాలు నిర్మించుకోవాలి.

How to Construct a Compound wall according to Vaastu, have a look

* ఇంటి ప్రధాన గుమ్మం ఎదురుగా కానీ కాంపౌండు గేటు ఎదురుగా కానీ ఎలాంటి గొయ్యిలు ఉండ రాదు. ఉదాహరణకు సంపు, బోర్, సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్ గుంత, నల్లగుంతలు మొదలగునవి అడ్డు రాకుండా జాగ్రత్తలు తీసుకుని నిర్మించుకోవాలి.

* అన్ని రకాలుగా రక్షణనిచ్చే 'మత్స్యయత్రాలు' ప్రహరీగోడ ( కాంపౌండు వాల్ ) లో స్థాపితం చేయరాదు, ఇది గమనించగలరు.

* ఇంటికి ప్రహరీ ( కాంపౌండు వాల్ ) అనేది ఇంటికి నాలుగు దిక్కుల వైపు ఖాళీ స్థలం వదులుకుని నిర్మాణం చేసుకోవాలి. ఏ దిశలో ఎంత వ్యత్యాసం ఉండాలో గమనించండి.

1. దక్షిణం ( South ) దిశలో 1 శాతం ఖాళీ స్థలం వదిలి పెట్టాలి.

2. పడమర ( West ) దిశవైపు 2 శాతం ఖాళీ స్థలం వదిలి పెట్టాలి. అంటే దక్షిణ దిశ కంటే పడమర దిశలో ఒక శాతం ఖాళీ స్థలం ఎక్కువ వదలాలి అన్నమాట.

3 . ఉత్తరం ( North ) దిశవైపు 3 శాతం ఖాళీ స్థలం వదిలి పెట్టాలి. అంటే పడమర దిశకంటే ఉత్తర దిశలో ఒక శాతం ఖాళీ స్థలం ఎక్కువ వదలాలి అన్నమాట.

4 . తూర్పు ( East ) దిశవైపు 4 శాతం ఖాళీ స్థలం వదిలి పెట్టాలి. అంటే ఉత్తర దిశ కంటే తూర్పు దిశలో ఒక శాతం ఖాళీ స్థలం ఎక్కువ వదలాలి అన్నమాట.

* ప్రహరీగోడలు భూమి నుండి 6 అడుగుల ఎత్తులో నిర్మించుకోవాలి.

ప్రహరీగోడ ఎత్తు వివరాలు:-

1) నైరుతి ( South West ) లో ఎత్తు 6' - 3"

2) ఆగ్నేయం ( South East ) లో ఎత్తు 6' - 2"

3) వాయువ్యం ( North West ) లో ఎత్తు 6' - 1"

4) ఈశాన్యము ( North East ) లో ఎత్తు 6' - 0" ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఇంటిలోనుండి బయటకు వెళ్ళడం. బయట నుండి ఇంట్లోకి రావడానికి కాంపౌండువాలుకు గేటు అవసరం. కాంపౌండువాలుకు ఎక్కువ శాతం ఇనుప గేటుతో నిర్మాణం చేసుకుంటారు. గేటుకు రంద్రాలు ఉండి గాలి లోపలకు వచ్చే విధంగా ఉండాలి.

* గృహం నిర్మించే సమయంలో ప్రహరీగోడ ఒక అడుగు లేదా ఒకట్టిన్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉండాలి. ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత పై సూచించిన కొలతలతో దిశల వారిగా 6 అడుగుల ఎత్తు గోడలు నిర్మిచుకోవాలి. ప్రహరీగోడ గేటు మంచి శుభ స్థానంలో నిర్మించుకోవాలి.

* ఇంటి కాంపౌండువాలు ఎత్తును బట్టి గేటు నిర్మాణం చేసుకోవాలి. ముఖ్యంగా వాస్తుకు అనుకూలంగా ఉన్న శుభ స్థానంలో గేట్లు అమర్చుకోవాలి. శుభ స్థానాలు, ఉచ్చ స్థానాలలో గేట్లు నిర్మించుకుంటే బయట నుండి ఏ చెడును ఇంట్లోకి రానివ్వకుండా కాపాడుతాయి.

* తూర్పు ( East ) , ఉత్తరం ( North ) , ఈశాన్యము ( North East ) సింహద్వారముల గేట్లు చిన్నవిగా బరువు తక్కువగా ఉండాలి.

* పడమర ( West ) , దక్షిణం ( South ) ఉన్న గేట్లు పెద్దవిగా బరువుగా ఉన్నవాటిని ఏర్పాటు చేసుకోవాలి.

* గేట్లు నిర్మాణం చేసుకునే అనుకూల దిశలు :- ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే దిశలను సూచించడం జరుగుతుంది. ఉచ్చ స్థానం అనేది ఇంటి కొలతలను బట్టి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అనుభావజులైన వాస్తు పండితులను సంప్రదించి నిర్మించుకోవాలి.

1) తూర్పు ఈశాన్యం

2) ఉత్తర ఈశ్యాన్యం

3) పశ్చిమ వాయువ్యం

4) దక్షిణ ఆగ్నేయం

English summary
According to Vaastu Constructing a bathroom in compound wall is not good
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X