వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

|
Google Oneindia TeluguNews

రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. మొన్నా మధ్య రెండు రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి గురై వాంతులు,విరోచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు. సహజంగా మనిషి రోజుకు 7-8 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపిస్తే.. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ ధరించాలి. రోజు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది.

How to protect from summer heat

సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయట పనులు చక్కబెట్టుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్‌ లాంటి దుస్తులు కాకుండా తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమట పొక్కుల సమస్య ఉండదు.

రోజు రెండుసార్లు స్నానం చేయాలి. తోలుతో చేసిన చెప్పులు వేసుకోవాలి. బిర్యానీలు, మాంసాహారం, శరీరానికి వేడి చేసే మసాల దినుసులు, కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, వేపుడు పదార్ధాలు తినకూడదు. నూనే తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది. అన్నం తిన్నాక చివరలో తప్పక మజ్జిగ అన్నం తినాలి.

ఎక్కువ వేడి చేసిన వారు రోజు మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలను నానబెట్టుకుని తినాలి. లేదా గాజు గ్లాసులో మూడు వంతుల నీళ్ళను పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం ఖండ శక్కర (మిశ్రి ) వేసి ఉదయం నానబెట్టి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆ నీటిని క్రమం తప్పకుండా త్రాగితే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలో ఉన్న అధిక వేడిని ఇది నివారిస్తుంది. ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరుగుకుని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. నేరుగా తినలేని వారు రుచి కోసం కొంచెం చక్కర కలుపుకుని తినవచ్చు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక, వాస్తు శాస్త్ర పండితులు ఫోన్: 9440611151

English summary
It’s that time of the year again – the time when we sweat through all our pores and wait desperately for rains to arrive. The summer time in India can be brutal even for the most experienced of us. Besides making us feel tired and zapped, it can even be downright harmful by increasing the risk of heatstroke. So how does one protect oneself in this heat?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X