జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే దండయాత్ర చేసే సమస్యలివే!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలు మన ప్రత్యక్ష జీవితాలపైన ఎన్నో ప్రభావాలను చూపిస్తాయి. అయితే గ్రహాలన్నింటిలోనూ సూర్యుడిని గ్రహాలకు రారాజుగా భావిస్తారు. సూర్యగ్రహాన్ని కుటుంబంలోని తండ్రి స్థానంగా పరిగణిస్తారు. అటువంటి సూర్యుడు మన జాతకంలో బలంగా ఉంటే మన జీవితం చాలా సంతోషదాయకంగా అద్భుతమైన విజయాలతో ముందుకు సాగుతుంది.

జాతకంపై సూర్యుడి ప్రభావం
అదే సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సేవా రంగంలో ఉన్నతమైన మరియు పరిపాలన స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. సమాజంలో గౌరవాన్ని పొందుతాడు. సూర్యగ్రహం నాయకుడిని సూచిస్తుంది. సూర్యుడు సింహరాశికి అధిపతి. సూర్యుడు మేషరాశిలో ఉన్నతంగా, తులా రాశిలో బలహీనమైన చిహ్నంగా పరిగణించబడతాడు.

If the Sun is weak in the horoscope it means problems invasion unexpected diseases

సూర్యుడు అశుభ స్థానంలో, బలహీనంగా ఉంటే వచ్చే ప్రధాన సమస్య ఇదే
సూర్య భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి నెల రోజుల వ్యవధి పడుతుంది. వేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ప్రతికూలమైన లేదా అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి వ్యాధుల బారిన పడతాడు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడతాడు. వ్యక్తికి కళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

సూర్యుడు బలహీనంగా ఉంటే ఈ వ్యాధులు
కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో సూర్యుడితో పాటు శని ప్రభావం వల్ల సదరు వ్యక్తికి రక్తపోటు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే జ్వరం, టైఫాయిడ్, మూర్ఛ తదితర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడతారు.

బంధాలు, కెరీర్.. ఇలా అన్నిట్లో ఇబ్బందులు
సూర్యుడు బలహీనంగా ఉంటే తండ్రికి ఏమాత్రం మంచిది కాదు. సూర్యుడు జాతకంలో బలహీనంగా ఉంటే కెరీర్ లోనూ చాలా సమస్యలు వస్తాయి. బంధాలు బలహీనపడతాయి. సూర్యుడు బలహీనంగా ఉంటే తండ్రి కొడుకులు మధ్య సంబంధాలు దెబ్బతింటాయి, సూర్య భగవానుడు జాతకంలో బలహీనంగా ఉంటే ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పోతుంది. ముఖం ఎప్పుడు నీరసంగా కనిపిస్తుంది.

సూర్యుడు ప్రతికూలంగా ఉంటే వ్యాధుల దండయాత్ర
ఒకదాని తరువాత ఒకటి వ్యాధులు దండయాత్ర చేస్తాయి. ఈ లక్షణాలు ఉన్నట్లయితే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాలి. జాతకంలో సూర్యుడు బలోపేతం అవ్వడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలను చేస్తే జాతకంలో సూర్యుడు బలోపేతం అవుతాడు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+