Sankranti 2025: సంక్రాంతికి ఈ పనులు చేస్తే సూర్యుడు సంపదల ఖజానా పంపుతాడు!

తెలుగు వాళ్ళందరూ అత్యంత సంబరంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగ సమయం రానే వచ్చింది. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమయ్యారు. జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర రాశిలో సూర్య సంచారం రోజు కొన్ని పనులు చేస్తే సూర్యుడి కటాక్షంతో శుభాలు జరుగుతాయి.

సంక్రాంతి నాడు ఈ వస్తువు ఇంటికి తెచ్చుకోండి
సూర్యుడు ఎవరైతే కొన్ని పనులు చేస్తారో వారికి సంపదల ఖజానా పంపిస్తాడు. మరి సంపదల కోసం మకర సంక్రాంతి పర్వదినాన చేయవలసిన ఆ పనులను గురించి తెలుసుకుందాం.
మకర సంక్రాంతి పర్వదినాన సూర్యభగవానున్ని పూజించడం వల్ల సూర్యుని కటాక్షం కలుగుతుంది. ఇక అదే రోజు ఒక వస్తువును తెచ్చి పెట్టుకుంటే కూడా కలిసి వస్తుంది.

If you do these things on Sankranti sun will send you a treasure trove of wealth

సూర్యుడి ప్రతిమ ఇలా ఉంటే అదృష్టం
మకర సంక్రాంతి పర్వదినం రోజు దానాలు చేయడంతో పాటు కొన్ని అదృష్టాన్ని ఇచ్చే వస్తువులను ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. సంక్రాంతి రోజు సూర్య భగవానుడు ఇత్తడి ప్రతిమను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఆ ఇంటికి శుభాలు జరుగుతాయి. ఇక సూర్యభగవానుడు విగ్రహం తీసుకొచ్చే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సూర్య భగవానుడి విగ్రహం విషయంలో కొన్ని రకాల హ్యాంగింగ్స్ సానుకూలమైన ఫలితాలను ఇస్తాయని బాగా కలిసి వస్తాయని చెబుతున్నారు.

గంటలతో సూర్యుడి హ్యాంగింగ్.. ఫలితం ఇలా
ముఖ్యంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు పరిష్కారం కావాలంటే, అందరూ ఆరోగ్యంగా జీవించాలంటే తూర్పు దిశలో ఇత్తడితో చేసిన సూర్యుడు ప్రతిమను అది కూడా గంటలలో వేలాడుతున్న హ్యాంగింగ్ ను ఇంట్లో పెట్టుకోవాలి. గాలికి ఆ గంటలు మోగితే ఇంటికి శుభసూచకం. అంతేకాదు ఇంట్లో సానుకూలతలను తీసుకురావడానికి రోగాల బారి నుండి కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతికూలతలు రాకుండా చేస్తుంది.

సంక్రాంతికి సూర్యుడికి ఇలా నివేదించండి
ఇక సంక్రాంతి పర్వదినం రోజున సూర్యుడితో పాటు విష్ణుమూర్తికి పూజ చేసే వారికి పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. సంక్రాంతి పర్వదినాన రాగి పాత్రలో నీళ్లతో పాటు ఎర్రటి పువ్వులను అక్షింతలను వేసి సూర్య భగవానుడికి నివేదిస్తే ఆపై 108 సార్లు సూర్య మంత్రాన్ని జపిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

సంక్రాంతి నాడు ఈ దానాలతో సంపదలు
ఇక మకర సంక్రాంతి పర్వదినాన దానధర్మాలు చేస్తే కూడా మంచిది. ఎవరికైనా ఆహారం, బట్టలు, నువ్వులు, బెల్లం, కిచిడీ వంటివి దానం చేస్తే సూర్యుడి కటాక్షంతో వీరికి మంచి జరుగుతుంది. సంపదలు, శ్రేయస్సు, ఆరోగ్యం కూడా ఈ పనులతో సూర్యుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+