నవరాత్రులలో తులసిపూజ ఇలా చేస్తే మీకు ధనయోగం!!
ప్రస్తుతం దేవి శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రుల సమయంలో ఇంట్లో ఆర్థిక లాభాలు చేకూర్చే, ధనయోగం కలగడానికి కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తులసి మొక్కకు దేవి శరన్నవరాత్రులలో పూజలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. అసలు దేవీ నవరాత్రుల సమయంలో తులసమ్మకు చేయవలసిన పూజలు ఏమిటి? పరిహారాలు ఏమిటి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
సనాతన ధర్మంలో తులసి సంపదకు దేవత అయిన లక్ష్మిగా పరిగణించబడుతుంది. తులసిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. తులసి మొక్కకు హిందూమతంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల సానుకూలశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తులసి మొక్క ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది. నవరాత్రుల సమయంలో మీ ఇంట్లో తులసి మొక్కకు ఈ పరిహారాలను పూజలను చేస్తే ఇల్లు సంపదలతో నిండిపోతుంది.

నవరాత్రులలో గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలను సమర్పించాలి. ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది మరియు ఇంటికి ఆర్థిక శ్రేయస్సును తీసుకువస్తుంది. నవరాత్రులలో తులసి మొక్క వద్ద సాయంత్రం పూట దీపాలను వెలిగించాలి. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నవరాత్రులలో ప్రతిరోజు తులసికి ప్రదక్షిణ చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
నవరాత్రులలో మొత్తం తొమ్మిది రోజులపాటు తులసిని పూజించడం వల్ల ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. నవరాత్రుల సమయంలో తులసి మొక్కను పొరపాటున కూడా తాకకూడదు. ఒకవేళ తాకితే తల్లి లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి నవరాత్రులలో ప్రతిరోజు తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. సాధ్యమైతే తప్పక నవరాత్రులలో తల్లి దుర్గా దేవితో పాటు తులసి మొక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిచండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications