హోలీ పండుగనాడు ఈ దానాలు చేస్తే దరిద్రం.. తీవ్ర నష్టం.. జాగ్రత్త!

దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీని ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీన మనమంతా హోలీ పండుగను జరుపుకోబోతున్నాం. రంగుల పండుగ హోలీని జరుపుకునే వారు పండుగకు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి, హోలీ పండుగకు ఇంటికి అదృష్టం రావాలంటే చేయవలసిన పనుల గురించి దరిద్రం మూటకట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన, చేయకూడని పనుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

హోలీ పండుగ నాడు దానాలు చెయ్యొచ్చా
ఇదే సమయంలో హోలీ పండుగ రోజు ఏ వస్తువులు దానం చేయకూడదనే విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. సహజంగా పండుగ ఏదైనా సరే దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతారు. అయితే హోలీ పండుగ నాడు దానం చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హోలీ పండుగనాడు కొన్ని వస్తువులను అసలే దానం చేయకూడదని చెబుతారు. ఒకవేళ పట్టించుకోకుండా దానధర్మాలు చేస్తే దురదృష్టం వస్తుందని చెబుతున్నారు.

If you make these donations on the occasion of Holi you will suffer poverty be careful

హోలీ పండుగ నాడు ఈ దానాలు చేస్తే దురదృష్టం
అసలు హోలీ పండుగ నాడు దానం చేయకూడదని చెప్పే వస్తువులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. హోలీ పండుగ రోజు బట్టలు దానం చేయకూడదు. ఎవరైనా హోలీ పండుగ నాడు బట్టలు దానం చేస్తే వారికి దురదృష్టం వస్తుంది. వారి జీవితంలో సంతోషం దూరం అవుతుంది. హోలీ పండుగ నాడు పొరపాటున కూడా స్టీల్ వస్తువులను లేదా ఇనుప వస్తువులను ఎవరికి దానం చేయకూడదు.

హోలీ పండుగ నాడు డబ్బులు దానం చేస్తున్నారా?
ఎవరైతే వీటిని తెలియక దానం చేస్తారో వారి ఆర్థిక పరిస్థితి పాడవుతుంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను వారు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక హోలీ పండుగ రోజు పొరపాటున కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. పండుగ నాడు డబ్బులు దానం చేసినా మంచిది కాదు. పండుగ నాడు డబ్బులు దానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఫలితంగా లక్ష్మీ కటాక్షం లభించదని కూడా చెబుతారు.

హోలీ పండుగ నాడు ఈ దానం చేస్తే కష్టాలు, నష్టాలు
అందుకే పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చే పనులను చేయకూడదని పండుగ నాడు డబ్బును దానం చేయకూడదని చెబుతున్నారు. ఇక హోలీ పండుగ రోజు పొరపాటున కూడా తెల్లని వస్తువులను దానం చేయకూడదు. మనం ఇంట్లో ఉపయోగించే పాలు, పెరుగు, పంచదార, ఉప్పు మొదలైన తెలుపు రంగు ఉన్న వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే జాతకంలో శుక్రుడు స్థానం బలహీనంగా మారి అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక హోలీ పండుగ రోజు పొరపాటున కూడా రంగులను దానం చేయకూడదు. ఇవి దానం చేసిన కూడా అనేక కష్టాలు, నష్టాలు వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+