Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2025లో ఏలినాటి శనితో ఈ రాశులవారు ఉక్కిరిబిక్కిరి.. ఉపశమనానికి ఇదొక్కటే మార్గం!

శని క్రమశిక్షణను నేర్పే గ్రహం. న్యాయదేవుడిగా కూడా శనికి గుర్తింపు ఉంది . శని మన కర్మ ఫలితాలను తిరిగి ఇచ్చేటువంటి గ్రహం. అంతేకాదు కష్టపడి పని చేసే వారికి ఎప్పటికీ అండగా ఉండి వారి సవాళ్లను అధిగమించడంలో సహాయం చేసే గ్రహం కూడా శని గ్రహమే. మనకు ఎంతో ఓర్పును, సహనాన్ని ఇచ్చే శనిగ్రహం ప్రభావం ప్రతి ఒక్క రాశి జాతకుల పైన తప్పకుండా ఉంటుంది.

ఏలినాటి శని దశలతో శని పరీక్ష
ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలా కొన్ని సమయాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కఠినమైన సవాళ్లను తీసుకువస్తాయి. వ్యక్తుల యొక్క బలహీనతలను ఎదుర్కోవడానికి వారిని మరింత బలోపేతంగా ఎదగడానికి శనిపెట్టే పరీక్షలో భాగంగానే ఇవి మానవ జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఏలినాటి శనిని శని సడే సతి అని అంటారు. ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల సుదీర్ఘకాలం.

In 2025 elinati shani gives difficulties to these zodiac signs try these remedies to overcome

ఏలినాటి శనితో 2025లో కష్టపడే రాశులు
శని దేవుడు ఒక వ్యక్తి యొక్క జన్మ చంద్రునిపై మరియు దానికి ముందు, ఆ తరువాత రాశుల మీదుగా సంచరించే కాలం ఏలినాటి శనిగా చెప్పబడుతుంది. ఇది మూడు దశలలో వ్యక్తుల జాతకాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావంతో కష్టాలను ఎదుర్కొనే రాశులు ఏమిటి? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

కుంభరాశి
కుంభరాశిలో ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది. ఏలినాటి శని రెండవ దశకు 2025 సంవత్సరంలో కుంభరాశి జాతకులు చేరుకుంటారు. ఈ సమయంలో స్థానికులు వారి వారి లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పని భారాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. పట్టుదలతోనూ, సానుకూల దృక్పథంతోను అడ్డంకులను అధిగమించవచ్చు.

మకర రాశి
మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం 2025 సంవత్సరంలో చివరి దశలోకి వెళుతుంది. ఈ దశ ఒక సవాలుగా మకర రాశి జాతకులకు మారుతుంది. ఈ సమయంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోవడంతో పాటు కొత్త ప్రారంభానికి సిద్ధం కావడం కూడా ఎంతో అవసరం. మకర రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఏలినాటి శని ప్రభావం నుండి గట్టెక్కుతారు.

మీన రాశి
మీన రాశి వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని మొదటి దశలోకి వస్తుంది. ఈ దశ మీన రాశి వారిపైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు బాధ్యతలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మీన రాశి వారికి క్రమశిక్షణతో పాటు ఆర్థిక ప్రణాళికతో వ్యవహరించడం చాలా అవసరం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+