రెండురోజుల్లో ఆదిదేవుడు గణపతి కటాక్షంతో వీరింట కనకవర్షం!

వినాయక చవితి పండుగ రాబోతుంది. ఆగస్టు 27వ తేదీన దేశవ్యాప్తంగా అందరూ గణేష్ చతుర్థి వేడుకలను జరుపుకుంటారు. హిందూమతంలో ఆదిదేవుడు గా వినాయకుడిని పూజిస్తారు. మనం ఏ పని చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తే ఆ పనులలో ఆటంకాలు తొలగిపోతాయని, విజయం చేకూరుతుందని చెబుతారు.

ఆదిపూజలందుకునే గణపతి కటాక్షం పొందే రాశులు
దేవుళ్ళు అందరిలోనూ మొదటిగా పూజించేది వినాయకుడినే కాబట్టి వినాయకుడి కటాక్షం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని చెబుతారు. అటువంటి వినాయక చవితి పర్వదినాన గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి వినాయకుడి కటాక్షం లభించనుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

In two days with the grace of the god Ganapati these zodiac signs will see a wealth rain

మేషరాశి
మేష రాశి వారికి వినాయక చవితి నుండి గణేషుడి కటాక్షం కారణంగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మేషరాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. ఇది మేషరాశి వారికి అదృష్ట సమయం.

మకర రాశి
మకర రాశి వారికి వినాయకుడి అనుగ్రహం వల్ల కెరీర్ బాగుంటుంది. వీరికి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మకర రాశిలోని విద్యార్థులు ఉన్నత ర్యాంకులను సాధిస్తారు. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వినాయక చవితి నుండి వీరికి ఆర్థిక లాభాలు వస్తాయి.

కుంభరాశి
కుంభ రాశి జాతకులకు వినాయక చవితి నుండి అనుకోని ప్రయోజనాలు చేకూరుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.

మీనరాశి
వినాయక చవితి నుండి గణేశుడు అనుగ్రహంతో అనుకూలమైన ఫలితాలను పొందే రాశులలో మీనరాశి ఒకటి. మీనరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. ఈ సమయం వీరికి చాలా సంతోషదాయకం గా ఉంటుంది. ఇంటా, బయట మీన రాశి వారికి బాగుంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+