బుధ రాహువుల కలయికతో జడత్వ యోగం చాలా డేంజర్.. పరిహారాలు ఇవే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ గ్రహానికి ఒక స్థానం ఉంటుంది. నవ గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ద్వాదశ రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పుకు కారణం అవుతున్నాయి. సంభాషణ గ్రహమైన బుధుడు నీడ గ్రహమైన రాహువు కలయిక కారణంగా జడత్వ యోగం ఏర్పడుతుంది.

శుభ యోగంగా జడత్వ యోగం
జడత్వ యోగాన్ని ఒక అశుభయోగంగా పరిగణిస్తారు. బుధుడు మరియు రాహువు జన్మ జాతకంలో ఒకే రాశి లేదా ఇంట్లో కలిసి ఉన్నప్పుడు జడత్వ యోగం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రతికూల ప్రభావాలను తీసుకువస్తుంది. ఇది ఊహించని చిక్కులకు కారణం అవుతుంది. ఈ యోగం వారి జాతకంలో ఉన్న వ్యక్తులు విపరీతమైన ఆర్థిక నష్టాలను, ఆందోళనలను, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు.

Jadatva yoga with Mercury and Rahu is very dangerous Here are the remedies

జడత్వ యోగాన్ని అధిగమించటం కోసం పరిహారాలు
జడత్వ యోగాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జడత్వ యోగం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడం కోసం జ్ఞాన దేవత అయిన సరస్వతి దేవిని ప్రార్థిస్తే మంచిదని చెబుతున్నారు. అలాగే దృష్టిని మరియు స్పష్టతను పెంపొందించడానికి చదువుకునే వారు ప్రతిరోజు కొన్ని నిమిషాల ధ్యానం చేస్తే మంచిదని చెబుతున్నారు.

ఇలా చేస్తే బుధుడి అనుగ్రహం
జడత్వ యోగం యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చతుర్థి తిథినాడు ఉపవాసం ఉండి గణేశుని పూజిస్తే మంచిదని చెబుతున్నారు. గణేశుడి ఆశీస్సులు పొందడం కోసం గరికను మరియు లడ్డూలను సమర్పిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఇక బుధుడు అనుగ్రహం కోసం జడత్వ యోగం నుంచి ఉపశమనం పొందడం కోసం సోదరీమణులను సంతోషంగా ఉంచాలని అలా చేస్తే బుధుడు సంతోషిస్తాడని చెబుతున్నారు.

బుధుడి అనుగ్రహం ఉంటే వ్యాపారాల వృద్ధి
బుధవారం నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది. బుధుడి అనుగ్రహం ఉంటే వ్యాపారాల వృద్ధి జరుగుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ పరిహారాలు పాటిస్తే ప్రతికూల ప్రభావాలు పోయి సానుకూల ఫలితాలు వస్తాయని, కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ పరిహారాలను పాటించాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+