మేషరాశిలో బృహస్పతి ప్రత్యక్షం; 2024లో ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పులివే!!
మేషరాశిలో బృహస్పతి డిసెంబర్ 31వ తేదీ 2023లో ప్రత్యక్షంగా మారుతుంది. మేషరాశిలో బృహస్పతి ప్రత్యక్షంగా మారడం వల్ల 2024సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైనటువంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. బృహస్పతి చాలాకాలంపాటు మేషరాశిలో తిరోగమనం చేసిన తర్వాత, డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాలకు ప్రత్యక్షంగా మారబోతున్నాడు. బృహస్పతి యొక్క ఈ ప్రత్యక్ష చలనం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలకు కొంత మేలు మరియు ఉపశమనం కలిగిస్తుంది.
మేషరాశిలో బృహస్పతి ప్రత్యక్ష చలనం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే మార్పులను తెలుసుకుంటే ఈ చలనం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత మరియు శాంతి వైపు మళ్లేలా చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వ్యక్తుల సంఖ్య 2024లో గణనీయంగా పెరుగుతుంది. నూనెలు, నెయ్యి, సుగంధ నూనెలు మొదలైన వాటి ధరలలో తగ్గుదల ఉంటుంది. అది ప్రజలకు కొంత ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది.

ఇక ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మంత్రులు దేశంలోని ప్రస్తుత అవసరాలకు సరిపోయే కొత్త కొత్త విధానాలను రూపొందించడంలో నిమగ్నమవుతారు. దేశ ప్రయోజనాల కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలతో న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధంతో దెబ్బతిన్న దేశాలు కొంత ఉపశమనం పొందుతాయి. మేషరాశిలో బృహస్పతి డైరెక్ట్ గా మారడం ఒక వ్యక్తిని పరిణితితో ఆలోచించేలా చేస్తుంది.
మేషరాశిలో బృహస్పతి డైరెక్ట్ గా మారడం స్టాక్ మార్కెట్ ని కూడా ప్రభావం చేస్తుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ కంపెనీలు, రబ్బరు పరిశ్రమలు ఈ కాలంలో సానుకూల మార్పులకు లోనవుతాయి. మేషరాశిలో బృహస్పతి డైరెక్ట్ గా మారడం కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డైమండ్ ఇండస్ట్రీ వంటివి సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది.
మేషరాశిలో బృహస్పతి డైరెక్ట్ గా మారడం పాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, నూనెలు, నెయ్యి మొదలైనవి మెరుగైన దశకు వెళ్లే అవకాశం ఉంది. గృహ నిర్మాణ పరిశ్రమ, రసాయన మరియు ఎరువుల పరిశ్రమలు, తేయాకు పరిశ్రమ వృద్ధిని పొందే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications