ఐదురోజుల్లో బృహస్పతి దయతో ఏనుగు అంబారీపై మహారాజుల్లా వీరు.. మీరున్నారా?
జ్యోతిషశాస్త్రంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. బృహస్పతి మన సౌర వ్యవస్థలోని అత్యంత ప్రభావవంతమైన గ్రహం. నిర్దిష్ట సమయం ప్రకారం సంచరిస్తూ గురువు రాశి చక్రాలు మరియు నక్షత్రాల గుండా వెళుతుంది. ప్రస్తుతం బృహస్పతి మిధున రాశిలో ఉన్నాడు. బృహస్పతి ఆగస్టు 13వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నారు.
పునర్వసు నక్షత్రంలో గురువు
ప్రస్తుతం గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు పునర్వసు నక్షత్రంలోనే సంచరించే గురువు కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తున్నాడు. పునర్వసు నక్షత్రంలో గురు సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. వివిధ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులు మంచి ప్రయత్నం చేస్తే డబ్బు సంపాదిస్తారు. వివిధ ఒప్పందాల నుండి లాభాలు వస్తాయి. కెరీర్లో కొత్త బాధ్యతలు ఉంటాయి. కెరీర్లో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. కెరీర్లో నిజమైన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.
మీనరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం మీనరాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. మీన రాశి వారికి అధిక రాబడిని తెస్తుంది. వివిధ సమస్యల నుంచి కుటుంబ సభ్యుల మద్దతుతో బయటపడతారు. ఈ సమయంలో చేసిన ప్రణాళికలు గొప్ప విజయాన్ని సాధిస్తాయి. వివాహ జీవితం ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీనరాశి జాతకులు నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించడానికి వీలుంటుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications