2026 జనవరి నుండి ఈ రాశులవారికి శుభవార్తల వెల్లువ.. మీరున్నారా?

వేద జ్యోతిష్య శాస్త్రంలో 2026లో అనేక గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దేవతల గురువైన బృహస్పతి 2026 లో పుష్య నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. శని అధిపతి అయిన పుష్య నక్షత్రంలో 12 సంవత్సరాలు తర్వాత జనవరి 30వ తేదీన బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.

పుష్య నక్షత్రంలో గురు సంచారం
ఆ రాశుల వారు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. బృహస్పతి పుష్య నక్షత్రంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారు శుభవార్తలు వింటారు. పుష్య నక్షత్రంలో గురు సంచారంతో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

jupiter transit into pushya nakshatra on january 30 2026 gives huge wealth to these zodiac signs

కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి బృహస్పతి పుష్య నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో కర్కాటకరాశి జాతకులు కొత్త ఉద్యోగాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశం వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి వారి మానసిక సమతుల్యత పెరుగుతుంది. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

కన్యారాశి
కన్యా రాశి వారికి బృహస్పతి పుష్య నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పెట్టుబడులు ప్రయోజనాలను చేకూరుస్తాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఇంట్లో శాంతి, సంతోషం ఉంటుంది. వ్యాపారవేత్తలు పెద్ద వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు.

ధనుస్సు రాశి
బృహస్పతి పుష్య నక్షత్రంలో సంచారం చేయడం ధనుస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారు వ్యాపారంలో గణనీయమైన విజయాలను సాధిస్తారు కుటుంబ సంబంధాలు బలపడతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సానుకూల శక్తిని అనుభవిస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+