12ఏళ్ల తర్వాత వృషభరాశిలోకి బృహస్పతి: ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అద్భుతమైన గ్రహాలలో, శుభాలను చేకూర్చే గ్రహాలుగా చెప్పబడే వాటిలో బృహస్పతి ముఖ్యమైనది. బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం. జాతకంలో బృహస్పతి అనుకూల స్థానంలో ఉంటే సంపద, సమృద్ధి, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి. బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి 12, 13 నెలలకోసారి కదులుతుంది.
వృషభరాశిలోకి బృహస్పతి
ఇక మే నెలలో బృహస్పతి అత్యంత ముఖ్యమైన రవాణా జరగబోతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మే ఒకటవ తేదీన మధ్యాహ్నం 2: 22 నిమిషాలకు వృషభరాశిలోకి వెళుతుంది. బృహస్పతి ఏ రాశిలోకి వెళ్లిన, మళ్లీ రాశిలోకి రావడానికి 12ఏళ్ల కాలం పడుతుంది.బృహస్పతి 12 ఏళ్ల తర్వాత మళ్లీ వృషభరాశిలోకి వస్తుంది. బృహస్పతి వృషభ రాశి సంచారం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది.

మేష రాశి
బృహస్పతి వృషభ రాశి సంచారం మేష రాశి వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో విందులు, వినోదాలు, విలాసాలలో గడుపుతారు. ఆర్థిక సమృద్ధి తో బృహస్పతి మేషరాశి జాతకులను ఆశీర్వదిస్తాడు.
సింహరాశి
బృహస్పతి వృషభ రాశి సంచారం సింహ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలను కలిగిస్తుంది. పూర్వీకుల ఆస్తి సమయంలో వచ్చే అవకాశం ఉంది. భూములు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కొనుగోలు చేసే ఆస్తులు దీర్ఘకాలంలో మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ సమయంలో రుణాలు తీసుకోకుండా ఉండాలని సలహా.
వృశ్చిక రాశి
బృహస్పతి వృషభ రాశి సంచారం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి జాతకుల నెలవారి ఆదాయం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరుల సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సౌకర్యవంతంగా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు.
కుంభరాశి
బృహస్పతి వృషభ రాశి సంచారం వల్ల కుంభ రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. మతపరమైన కార్యక్రమాలతో పాటు, కుటుంబ అవసరాలను తీర్చడానికి ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. రుణ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ సమయం మీకు ఉపయోగపడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications