దీపావళికి ముందు ఈ రాశులవారికి డబ్బుల మూటలు విసిరేయనున్న బృహస్పతి!
జ్యోతిష శాస్త్రంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవతల గురువైన బృహస్పతి ఆధ్యాత్మికతకు, సంతానానికి, శ్రేయస్సుకు, జ్ఞానానికి కారకుడు. అటువంటి గురువు 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 20వ తేదీన దీపావళికి ముందు గురువు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు.
కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం
కర్కాటక రాశి గురువు యొక్క ఉచ్చరాశి కావడంతో ఈ సంచారంతో కొన్ని రాశుల వారికి లబ్ది జరుగుతుంది. వీరు అనుకున్నవి ఈ సమయంలో నెరవేరుతాయి. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను చూడబోతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి గురువు రాశి మార్పు సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటకరాశి జాతకులు గురువు కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. గురువు కర్కాటక రాశిలో కర్మ గృహంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. దీపావళి నాడు మీకు ఆకస్మిక ధన లాభం వస్తుంది. ఉద్యోగం చేసే చోట బహుమతులు పొందుతారు.
వృశ్చిక రాశి
గురువు సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో అన్ని విషయాలలోనూ అదృష్టాన్ని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కి సంబంధించి వ్యాపారాలు చేసేవారు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే సమయం.
కన్యారాశి
బృహస్పతి సంచారం కన్యారాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కన్య రాశి జాతకులు సమాజంలో గౌరవ, మర్యాదలను పొందుతారు. కన్యారాశిలో బృహస్పతి లగ్న గృహం నుండి సంచారం చేస్తాడు కాబట్టి మీకు ప్రజాదరణ ఉంటుంది. ఈ సమయంలో కోర్టు కేసులను గెలిచే అవకాశం ఉంది. చేసే ప్రతి పనిలోనూ అదృష్టం మీ వెంటే ఉంటుంది చేసే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పెళ్లయిన వారు సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications