జులైలో కేతువు నక్షత్ర సంచారంతో నక్కతోక తొక్కే రాశులివే!
నీడ గ్రహమైన కేతువు జూలై 20 2025 పూర్వ ఫల్గుణి నక్షత్రం నాలుగవ పాదంలో కి సంచారం చేస్తాడు. వేద జ్యోతిషశాస్త్రం మూలాల ప్రకారం పూర్వ ఫల్గుణి యొక్క నిర్దిష్ట పాదము అదృష్టంతో ముడిపడి ఉంటుంది. అటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్రం లోనికి కేతువు ప్రవేశించడం వల్ల ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
జులైలో పూర్వ ఫల్గుణి నక్షత్రం నాల్గవ పాదంలోకి కేతువు
పూర్వ ఫల్గుణి నక్షత్రం సృజనాత్మకతను, సామాజిక సంబంధాలను కలిగి ఉంటుంది. సహజంగా ఈ నక్షత్రం యొక్క నాల్గవ పాదాన్ని శుభప్రదంగా భావిస్తారు. కేతువు నక్షత్రం మార్పు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా సింహరాశి, వృషభ రాశి, కుంభ రాశి, తులా రాశి జాతకులు కేతువు నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు.

వృషభ రాశి
కేతువు నక్షత్ర సంచారం వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పనిచేసే చోట మంచి గుర్తింపు వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి ఇది కలిసి వచ్చే కాలం.
తులారాశి
కేతువు నక్షత్ర సంచారం తులా రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. తులా రాశి వారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. వైవాహిక జీవితంలో సానుకూలత పెరుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. తులా రాశి వారు ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరి జీతం పెరిగే అవకాశం ఉంది . ఏ పని చేసిన ఇప్పుడు విజయాలను సాధిస్తారు.
కుంభరాశి
కేతువు నక్షత్ర సంచారం కుంభరాశి వారికి మెరుగైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుంభ రాశి వారికి ఇప్పుడు ఆర్థికంగా బలంగా పరిస్థితులు మారుతాయి. ఉద్యోగం చేసే చోట మంచి గుర్తింపు వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి సమయం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు.
సింహరాశి
కేతువు నక్షత్ర సంచారం సింహరాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. పనిచేసే చోట మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థికపరమైన అంశాలలో స్థిరత్వం వస్తుంది. కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించి సంతోషంగా ఉంటారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు












Click it and Unblock the Notifications