కృష్ణ అంగారక చతుర్దశి చాలా పవర్‌ఫుల్.. నేడు ఇలా చేస్తే నూతన గృహయోగం!
అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. దానికి ముందు రోజు అంటే నేడు అక్టోబర్ ఒకటవ తేదీన సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్దశి . కాబట్టి నేడు కొన్ని పనులు చేస్తే సొంతింటి కల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కృష్ణ అంగారక చతుర్దశికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
కృష్ణ అంగారక చతుర్దశి చాలా స్పెషల్
ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా పిలుస్తారు. అయితే కృష్ణ అంగారక చతుర్దశకి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందని చెబుతారు. సూర్యగ్రహణం రోజున కొన్ని పనులు చేస్తే ఏ విధంగా అయితే మంచి ఫలితాలు వస్తాయో అదేవిధంగా కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా కొన్నిపనులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయని అదృష్టం తీసుకువస్తాయని చెబుతున్నారు.

కృష్ణ అంగారక చతుర్దశి నాడు ఇలా చెయ్యండి
కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, స్నానం చేసేటప్పుడు బక్కెట్లో ఎర్రటి పూలు కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్లల్లో కలుపుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతి కలుగుతుందని చెబుతారు. ఈ స్నానం నవగ్రహాలలో ముఖ్యమైన అంగారకుడికి ప్రియమైనటువంటి స్నానం గాను భావిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్యుడి, అంగారకుడి కటాక్షం మీ పైన తప్పనిసరిగా ఉంటుంది.
స్నానం చేశాక ఇలా చేస్తే శుభ ఫలితాలు
ఇక స్నానం చేసిన తరువాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని నీళ్లలో ఎరుపు రంగు పూలు, కొద్దిగా కుంకుమ పువ్వు, ఎండు మిరపకాయల గింజలు వేసి తూర్పుకి అభిముఖంగా తిరిగి ఓం గృహిణిహిం సూర్య ఆదిత్య ఓం అంటూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి మొక్కలకు నీళ్లు పోయాలి. ఈ విధంగా 12 సార్లు మంత్రం జపించి సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయి.
ఇలా చేస్తే రవి బలం పెరుగుతుంది
అంతే కాదు నేడు పితృ తర్పణం ఇస్తే మామూలు రోజుల్లో పితృతర్పణం చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది. కృష్ణ అంగారక చతుర్దశి రోజు బ్రాహ్మణుడికి గోధుమలు దానమిస్తే సంవత్సరమంతా జాతకంలో రవి బలం బాగుంటుంది. అంతేకాదు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదివితే రుణ బాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని చెబుతారు.
యమదీపం వెలిగిస్తే ఈ దోషాలు పోతాయి
కృష్ణ అంగారక చతుర్దశి నాడు ఇంట్లో దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి 8 వత్తులను ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుంది ఈ దీపాన్ని యమదీపంగా పిలుస్తారు ఈ దీపం పెట్టడం వల్ల అప మృత్యు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి.అంతే కాదు కందులను ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దానం ఇస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.
ఈ దానాలతో సొంతింటి కల తీరుతుంది
కుజదోషం పోతుంది. అంతేకాదు సొంతింటి కల కూడా నెరవేరుతుంది. అందుకే కృష్ణ అంగారక చతుర్దశి తిధి నాడు అంటే నేడు ఈ పనులు చేసి మంచి ఫలితాలను పొందాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.మరెందుకాలస్యం సొంతింటి కల తీరాలంటే పైన పేర్కొన్న దానాలు చెయ్యండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications