క్రోధి నామ ఉగాది: ఈ పనులు చెయ్యండి.. ఏడాదంతా డబ్బే డబ్బు!!

తెలుగువారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే, తొలి పండుగ ఉగాది పండుగ. ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు విశేషంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తేదీన, అంటే రేపు జరుపుకుంటున్నాం. ఉగాది పండుగ నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అందుకే యుగానికి ఆదిగా ఉగాదిని మనం జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి.

ఉగాది పండుగ నాడు ఆరు పనులు తప్పక చెయ్యండి
ఈ సంవత్సరం క్రోధి నామ ఉగాదిగా జరుపుకోబోతున్నాం. క్రోధి నామ నూతన తెలుగు సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలంటే, ధనలక్ష్మి కటాక్షం ఉండాలంటే ఏం చేయాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పండుగ నాడు ఆరు పనులు తప్పక చేస్తే సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షం ఉంటుందని, సుఖ సంతోషాలతో జీవిస్తాం అని చెబుతున్నారు.

Krodhi Nama Ugadi Do these things will get Money for the whole year

ఉగాది నాడు ఈ పనులు చేస్తే అంతా శుభం
ఉగాది రోజు నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం ఆచరించాలి. ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించాలి. ఉగాది రోజంతా సంతోషంగా గడపాలి. ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడిని రుచి చూడాలి. ఉగాది పండుగనాడు ప్రతి ఒక్కరు పంచాంగ శ్రవణాన్ని వినాలి. ఇలా ఉగాదినాడు పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆ సంవత్సరం అంతా వారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.

ఇలా చేస్తే ఏడాదంతా డబ్బే డబ్బు
ఉగాది పచ్చడి తో పాటు, నైవేద్యాలను తయారుచేసి నైవేద్యంగా సమర్పించి పండుగ నాడు ఇంట్లో లక్ష్మీదేవికి విశేషమైన పూజలు జరపాలి. అప్పుడు తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అయితే కొత్త బట్టలను, ఆభరణాలను, కొత్త గొడుగును, లేదా విసనకర్ర ను కొనుగోలు చెయ్యటం చేస్తే మంచిది. ఇలా ఉగాది పండుగ రోజు కొనుగోలు చేస్తే ఇంట్లో డబ్బులు సంవత్సరం అంతా నిలుస్తాయని చెప్తారు.

సంవత్సరపు తొలిపండుగ.. సంతోషంగా జరుపుకోండి
ఉగాది పండుగ రోజు ఎంత ఆనందంగా ఉంటే, సంవత్సరమంతా అంటే ఆనందంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. తెలుగు సంవత్సరంలో తొలి పండుగ ఉగాది కాబట్టి వీలైనంత సంతోషంగా జరుపుకోవడం శుభదాయకం. అలా పండుగ నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే పనులు చేస్తూ సంతోషంగా ఉగాదిని జరుపుకుంటే వచ్చినంత మీకు సంపదకు లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+