క్రోధి నామ ఉగాది పంచాంగం: వృశ్చికరాశి వారికి అన్నీ శుభాలే కానీ ఇబ్బంది అదే!!
క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ రంగంలో కలిసి వస్తుంది? వృశ్చిక రాశి వారు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? వంటి అనేక వివరాలను ఉగాది పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం.
వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలిలా
వృశ్చిక రాశి వారికి క్రోధి నామ నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 8 వ్యయం 14 గా ఉంది. ఇక రాజపూజ్యం 4 అవమానం 5 గా ఉంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో బృహస్పతి ఏడవ స్థానంలో స్థానంలో సంచరిస్తున్నారు. శని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు పంచమ స్థానంలో కేతువు లాభ స్థానంలో సంచరిస్తున్నారు.

అర్ధాష్టమ శని ప్రభావం.. అయినా గురువు వల్ల అనుకూలతలు
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కళత్రం లో గురువు యొక్క అనుకూల ప్రభావం చేత, పంచమంలో రాహువు, లాభంలో కేతువు యొక్క అనుకూలత వల్ల మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు. అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కాస్త కష్టం, శ్రమ పెరుగుతుంది.
ఆర్థికపరంగా
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా పురోగతి కనిపిస్తుంది. అప్పుల బాధలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆర్థిక విషయాలలో కాస్త లాభదాయకం గానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఆరోగ్య అవసరాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కుటుంబ పరంగా
ఈ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు కుటుంబ పరంగా కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రేమ పరమైన అంశాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శారీరకంగాను, మానసికంగాను సౌఖ్యాన్ని, సంతోషాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కెరీర్ పరంగా
వృశ్చిక రాశి వారి ఉద్యోగ జీవితం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అన్ని ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్కసారి గ్రహాల అననుకూలత వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది.
ఆరోగ్యపరంగా
వృశ్చిక రాశి జాతకులకు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కాస్త అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే కళత్రం లో గురువు ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్య విషయంలో కాస్త మార్పు వచ్చి ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications