కుబేరయోగంతో ఈ రాశులవారికి త్వరలో సంపదలను ప్రకటించిన బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతి కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవగరువు బృహస్పతి తన సంచారంతో ద్వాదశ రాశుల వారికి సానుకూల, ప్రతికూల ఫలితాలను వివిధ దశలలో ఇస్తున్నాడు. 2025 వ సంవత్సరం వరకు బృహస్పతి తన ఉచ్ఛ రాశిలో ఉంటాడు. బృహస్పతి మే ఒకటి 2025 నుండి కుబేర యోగాన్ని ఏర్పరుస్తాడు.

బృహస్పతి కారణంగా కుబేరయోగం
ఎవరి జాతకంలో అయితే రెండవ, పదకొండవ గృహాల అధిపతులు వారి సొంత రాశిలో లేదా ఉన్నతమైన రాశులలో ఉన్నప్పుడు కుబేర యోగం ఏర్పడుతుంది. కుబేర యోగం ఒక శుభయోగం. ఈ కుబేర యోగం నుండి కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. వారి సిరిసంపదలు, వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Kubera yoga 2025 Jupiter will rain unexpected wealth for these zodiac signs

మేష రాశి
మేష రాశి వారికి కుబేర యోగం కారణంగా శుభాలు చేకూరుతాయి. మేషరాశి జాతకులకు కుబేర యోగం ఇచ్చే శుభ ప్రభావంతో ధన,ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ సమయంలో జీవితంలో దేనికి లోటు లేకుండా జీవిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. మేష రాశి జాతకులకు ఈ సమయం నిజంగా అదృష్టకాలం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుబేర యోగంతో అదృష్టం తలుపులు తెరుస్తుంది. కర్కాటక రాశి జాతకులు అపారమైన సంపదలను పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇదే సరైన సమయం. వర్తక వ్యాపారాలలో ఊహించని లాభాలు ఉంటాయి .సమాజంలో ప్రశంసలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

సింహరాశి
సింహ రాశి వారికి బృహస్పతి ఇస్తున్న కుబేర యోగం కారణంగా అదృష్టం ప్రకాశిస్తుంది. ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుబేర యోగంతో మీకు వివిధ వనరుల నుండి డబ్బులు సమకూరుతాయి. జీవితంలో సుఖానికి, సౌఖ్యానికి ఎటువంటి లోటు ఉండదు. కష్టపడి పని చేసే వారికి ఫలితం లభిస్తుంది. సింహరాశి జాతకులు గొప్ప జీవితాన్ని గడపడానికి ఇది సరైన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+