కృష్ణాష్టమి నుండి వీరికి మొదలైంది లక్ష్మీ యోగం.. మీ రాశి ఉందా?
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్ట్ నెలకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలోనే రాఖీ పండుగ, శ్రీకృష్ణాష్టమి వేడుక జరుగుతున్నాయి. నేడు ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు పుట్టిన ఈ రోజున వాడవాడలా విశేషంగా వేడుకలు జరుపుతున్నారు. అటువంటి శ్రీకృష్ణాష్టమి జన్మదినాన జ్యోతిష పరంగా కూడా కొన్ని యోగాలు సంభవిస్తున్నాయి. ఈ యోగాల కారణంగా నేటి నుండి కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతున్నారు.
వీరిపై లక్ష్మీదేవి కటాక్షం
ఆగస్టు 16 ఉదయం 11:43 నిమిషాలకి చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఇక సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు, గురువు మిధున రాశిలో సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం కారణంగా నేడు వృద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశుల వారిని లక్ష్మీదేవి కరుణించి విశేష సంపదలను ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి శ్రీకృష్ణాష్టమి మంచి ఫలితాలను ఇస్తుంది .మేష రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నేటి నుండి ఈ రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కెరీర్ బాగుంటుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. మేష రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.
వృషభరాశి
వృషభ రాశి వారికి నేడు ఏర్పడే విశేష యోగాల కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి జాతకులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సానుకూల శక్తితో సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి
కృష్ణాష్టమి నుండి వృశ్చిక రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వీరికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నాయకత్వ లక్షణాలు వీరిలో పెరుగుతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెళ్లిళ్లు కాని వారికి వివాహ యోగం ఉంది. ఈ సమయంలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications