అక్టోబర్ 2న సూర్యగ్రహణం కారణంగా ప్రపంచ వ్యాప్త ప్రతికూలతలు... నివారణలివే!
అక్టోబర్ రెండవ తేదీ సర్వ పితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం కొన్ని రాశుల వారిపైన సానుకూల, కొన్ని రాశుల వారిపైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మరియు కేతువు ఇద్దరూ ఒకే రాశిలో ఉంటారు. దీంతో హస్తా నక్షత్రం ద్వారా పాలించబడే రాశుల వారు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు.
కన్యారాశి వారికి కంటి సమస్యలు
ఈ సమయంలో వీరిలో శక్తి తక్కువగా భావించబడుతుంది. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉండడం వల్ల ముఖ్యంగా కన్య రాశి వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చంద్రుడు హస్తా నక్షత్రాన్ని పాలిస్తాడు కాబట్టి ఈ సమయంలో చర్మానికి సంబంధించిన అలర్జీలు కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

సూర్య గ్రహణంతో స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక ప్రభావాలు
సూర్యుడు చంద్రుడి నక్షత్రంలో ఉండడం వలన కొన్ని రాశుల వారికి మానసిక ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. సూర్యగ్రహణం యొక్క స్వల్పకాలిక ప్రభావాలను మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు చూస్తామని, అలాగే ప్రపంచం నెమ్మదిగా దీర్ఘకాలిక ప్రభావాలతో కూడా బాధపడుతుందని సూర్య గ్రహణం కనిపించే ప్రదేశాలలో చూడవచ్చు.
ప్రకృతి విపత్తులు, బంగారం ధర పెరుగుదల
అనేక దేశాలు సూర్య గ్రహణ ప్రభావంతో ప్రకృతి విపత్తులను చూడవచ్చు. అనేక దేశాలు ఆకస్మికంగా పతనం కావచ్చు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు పిల్లలపై ఆకస్మిక ఉగ్రదాడులు, హింస జరగవచ్చు .సూర్యగ్రహణం ప్రభావంతో భారతదేశంలో ఈ శీతాకాలం చాలా కఠినంగా ఉండవచ్చు. బంగారం ధర పెరగవచ్చు. అయితే సూర్యగ్రహణం కారణంగా ఏర్పడే ప్రతికూలమైన ప్రభావాలకు నివారణలు కూడా ఉన్నాయి.
సూర్య గ్రహణం ప్రతికూలతల నివారణలు
ఏ రాశుల వారి పైన సూర్యగ్రహణం కారణంగా ప్రతికూలతలు వస్తాయో వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. పేదలకు దానధర్మాలు చేయాలి. ముఖ్యంగా గోధుమలు బెల్లం దానం చేస్తే మంచిది. కేతువును ప్రసన్నం చేసుకోవడానికి కేతువు శాంతి పూజ చేయాలి.మంగళవారం నాడు పేదలకు దానధర్మాలు చేయడం మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చేయాలి. కేతు మంత్రాన్ని పఠించాలి. ఓం కేం కేతవే నమః అని రోజుకు 108 సార్లు జపిస్తే ఫలితం ఉండవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా? -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం! -
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే! -
నల్ల బంగారం, ప్రపంచంలోనే కాస్ట్లీ కలప ఇదే! కిలో ఎన్ని లక్షలు? -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications