కలలో శ్రీరామ దర్శనం.. మీ జీవితంలో ఊహించని అద్భుత ఫలితం
కలలకు మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. కలలు మన జీవితంలో జరిగే భవిష్యత్తు పరిణామాలకు సంకేతంగా ఉంటాయి. కలల శాస్త్రంలో ప్రతి కలలకు కొంత అర్థం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కలలు గుర్తుంటే, మరికొన్ని సందర్భాలలో కలలను మరిచిపోతారు. అయితే కొన్ని కలలు కనడం మాత్రం జీవితంలో భవిష్యత్తులో జరిగే కారణమవుతాయని చెబుతారు.
కలలో శ్రీరాముడు కనిపిస్తే ఏమవుతుంది?
అయితే కలలో దేవతల విగ్రహాలు వస్తే, దేవతా మూర్తుల దర్శనం అయితే ఏం జరుగుతుంది? కలలో శ్రీరాముడు వస్తే, కలలో శ్రీరామ మందిరం కనిపిస్తే ఏం జరగబోతుంది? కలలో రామయ్య కనిపిస్తే పుణ్యమా? లేదంటే ఏదైనా జరుగుతుందా? వంటి విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం దేశమంతా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. రామయ్య కళ్యాణానికి, శ్రీరామ పట్టాభిషేకానికి దేశమంతా సిద్ధమవుతోంది.

కలలో రామయ్య కనిపిస్తే జరిగేదిదే
ఇప్పటికే ఎంతోమంది శ్రీరామ భక్తులు జైశ్రీరామ్ అంటూ తమ రామభక్తిని చాటుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో కొంతమంది రాత్రివేళ శ్రీరాముడిని కలలో దర్శించే భాగ్యం కూడా పొందుతున్నారు. కలలో శ్రీరాముడు కనిపిస్తే మంచిదేనా.. అంటే రామయ్య కనిపించడం శుభసూచకం. ఎవరైతే కలలో రాముడిని దర్శిస్తారో వారు రాబోయే కొద్దిరోజుల్లో మంచి శుభవార్త వినబోతున్నారని అర్థం. అంతేకాదు ఏవైనా సమస్యలలో సతమతమవుతుంటే వాటినుండి కూడా గట్టెక్కబోతున్నారు అన్నది ఈ కల సంకేతం.
రామ మందిరం చూస్తే ఇలాంటి ఫలితాలు
ఇక కలలో రామ మందిరాన్ని చూసినట్లయితే మీ జీవితంలోని దురదృష్టం తొలగిపోతుందని, శుభసూచకమని చెబుతుంది స్వప్న శాస్త్రం. కలలో రామ మందిరాన్ని చూసిన వారికి జీవితంలో చేసుకున్న ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయని, వారి లక్ష్యాలు త్వరలో నెరవేరుతాయని స్వప్న శాస్త్రం వెల్లడిస్తోంది.
ఆంజనేయ స్వామీ, హనుమాన్ ఆలయం కలలో వస్తే ఫలితాలిలా
కలలో రామయ్యకు అత్యంత ఇష్టమైన ఆంజనేయస్వామి కనిపిస్తే అది కూడా శుభసూచకమని, ఆర్థిక ప్రయోజనాలను పొందడం మాత్రమే కాకుండా, కాబోయే రోజుల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఇక ఆంజనేయ స్వామి గుడి కానీ విగ్రహం కానీ కలలో కనిపించిందంటే, శత్రువులను జయిస్తామని, రామబంటు అయిన హనుమంతుడికి సంబంధించిన కలలు వస్తే ఎటువంటి విషయంలో అయినా విజయం సాధిస్తామని కలల శాస్త్రం చెబుతోంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications