Lunar eclipse 2023: చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవటానికి పరిహారాలివే!!
ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం రేపు సంభవించబోతుంది.అక్టోబర్ మాసంలో శుక్లపక్షంలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28 అక్టోబర్ 29 తేదీల మధ్య అర్ధరాత్రి ఒంటిగంట ఆరు నిమిషాల నుండి రెండు గంటల 24 నిమిషాల వరకు ఏర్పడుతుంది. ఇక ఈ చంద్రగ్రహణం అనేక రాశుల వారి పైన ప్రతికూలమైన ప్రభావాలను కలిగిస్తుంది.
ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ నాడు ఏర్పడే ఈ చంద్రగ్రహణం శరద్ పూర్ణిమ నాడు ఏర్పడుతున్న అరుదైన పాక్షిక చంద్ర గ్రహణం. ఇది 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం కలిగించే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి కొన్ని నివారణలు ఉన్నాయి. చంద్రగ్రహణం సమయంలో చేయవలసిన కొన్ని నివారణలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఎప్పుడైనా గ్రహణం ఏదైనా సరే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి వీలైనంత దానధర్మాలు చేయాలి. గ్రహణం విడిచిన తరువాత దానధర్మాలు చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. గ్రహణ సూతకం ప్రారంభానికి ముందు పూజ చెయ్యాలి. గ్రహణం తర్వాత గంగాజల స్నానం చేసి, ఇంటిని గంగాజలంతో శుద్ధి చేయండి. దీనివల్ల కూడా గ్రహణ దోషాలు తొలగిపోతాయి.
గ్రహణ సమయంలో ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మృత్యుంజయ మహా మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక చంద్ర గ్రహణానికి ముందు ఒక వెండి పాత్రలో గంగాజలంలో పాలు, పంచదార మరియు బియ్యం వేసి చంద్రుడికి అర్ధాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతతను పొందుతారు. వృత్తిపరమైన చిరాకుల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
ప్రతికూలతలను తొలగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రహణం సంభవించినప్పుడు చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపించి, చంద్రుని కటాక్షాన్ని పొందండి. గ్రహణ సమయంలో శివున్ని పూజించడం వల్ల, శివ మంత్రాలను పఠించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి గ్రహణం సమయంలో ఈ పరిహారాలను పాటించి ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications