Maha shivratri 2023: మహాశివరాత్రి పూజలు చేసే వారు ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!!
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి పర్వదినం రోజు ఎంత విశేషంగా పూజలు చేసిన వారైనా కొన్ని తప్పులు చేస్తే శివుడికి పూజలు చేసిన ఫలితం ఉండదని చెబుతారు.
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. భక్తవ శంకరుడు బోళా శంకరుడు అయిన ఆ పరమశివునికి అత్యంత ఇష్టమైన శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఆ శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన విధంగా పూజాధికాలం నిర్వహిస్తారో వారిపై పరమశివుని కటాక్షం ఉంటుందని చెబుతారు. ఈ సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 18 వ తేదీన వస్తుంది. శివ భక్తులు అందరూ మహాశివరాత్రి జాగారానికి రెడీ అవుతున్నారు.

శివరాత్రి నాడు శివుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు
అయితే శివరాత్రి పర్వదినం రోజు ఎంత విశేషంగా పూజలు చేసిన వారైనా పండుగ రోజు కొన్ని తప్పులు చేస్తే శివుడికి పూజలు చేసిన ఫలితం ఉండదని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినాన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ విధంగా ఉండాలి? ఏం చేయకూడదు అనే విషయాలను ప్రస్తుతం మనం ఇక్కడ తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినాన శివుడిని పూజించే సమయంలో, శివుడికి అర్చన చేసే సమయంలో పొరపాటున కూడా తులసీదళాలను ఉపయోగించకూడదని చెబుతున్నారు.

అభిషేకం చేసే విషయంలో జాగ్రత్త
శివుడిని బిల్వపత్రాలతో పూజించాలని, తులసి దళాలతో శివుని పూజించడం చేయకూడదని సూచిస్తున్నారు. శివరాత్రి నాడు చాలామంది శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. శివాలయాలలో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేసేవారు పాల ప్యాకెట్లను ఉపయోగించకూడదని చెబుతున్నారు.
ఆవుపాలతో శివుడికి అభిషేకాన్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు శివుడికి స్వచ్ఛమైన నీటితోనూ అభిషేకం చేస్తే మంచిదని చెబుతున్నారు. .

మహాశివరాత్రి నాడు ఈ తప్పులు చెయ్యొద్దు
ఇక శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ, వెంట్రుకలు కానీ శివుడిపై పడకూడదని చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదని కడుపు ఆకలితో ఉంటే శివుడు మీద మనసు లగ్నం చేయడం కష్టంగా ఉంటుందని అంటున్నారు.
శివరాత్రి పర్వదినాన ఎటువంటి పరిస్థితులలోనూ ఆల్కహాల్ సేవించడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ చేయకూడదని, అది మనం చేసిన పూజల ఫలితాన్ని ఇవ్వదని చెబుతున్నారు. శివరాత్రి నాడు భార్యాభర్తల కలయిక కూడా పూజల ఫలితాన్ని అందించదని చెబుతున్నారు.

శివరాత్రి నాడు పూజల ఫలితం కలగాలంటే ఇది చెయ్యండి
శివరాత్రి పర్వదినం నాడు నిష్ఠతో శివుడిని పూజించడంతోపాటు దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. పైన నియమాలను పాటించి నిష్టగా శివుడిని పూజించడంతోపాటు, జాగరణ ఉండి పేదసాదలకు దానధర్మాలు చేస్తే శివరాత్రి పూజల ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. ఇక ఈ విషయాలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications