నవంబర్ మాసంలో ఈ రాశులవారికి డబ్బే డబ్బు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనమే ద్వాదశ రాశులవారి జాతకాలను నిర్ణయిస్తుంది. గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా నవంబర్ మాసంలో అన్ని రాశుల జాతకాలలోనూ మార్పులు వస్తాయి. కొన్నిసార్లు గ్రహాలు తిరోగమనంలో సంచరిస్తాయి. ఇది అన్ని రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాలను చూపిస్తుంది.
నవంబర్ లో ముఖ్య గ్రహాల రవాణా
నవంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా రెండు నెలల పాటు వివిధ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. నవంబర్ మొదటి వారంలో శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచారం మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడుధనుస్సు రాశిలోకి సంచారం చేయటం కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడనుంది.

శుక్ర, శని, సూర్యుల సంచారం ప్రభావం
ఇక నవంబర్ 15వ తేదీన శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న శని ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తున్నాడు. ఇక నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ముఖ్య గ్రహాల రవాణాతో ఐదు రాశుల వారికి శుభాలు జరుగుతాయి. నవంబర్ లో రవాణా చేసే ముఖ్య గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారిపై నెలంతా కచ్చితంగా ఉంటుంది.
మేష రాశి
మేష రాశి వారికి నవంబర్ మాసం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారికి సంపద పెరుగుతుంది. నూతన ఉద్యోగావకాశాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా కచ్చితంగా విజయం వరిస్తుంది. అన్నింటా శుభమే జరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నవంబర్ నెల లాభాలను ఇస్తుంది. వీరికి ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతుల తో పాటు, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కర్కాటక రాశి జాతకులకు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు విజయాలను సాధిస్తారు.
సింహరాశి
సింహరాశి వారికి నవంబర్ నెల అదృష్టాని ఇస్తుంది. ఈ సమయంలో వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది. మంచి జీవిత భాగస్వాములు దొరుకుతారు. ఈ సమయంలో వీరు రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగాలను సాధిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్యా రాశి
కన్యారాశి వారికి నవంబర్ నెల సానుకూల ఫలితాలను ఇస్తుంది. నవంబర్ నెలలో కన్యా రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి జాతకుల ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారమవుతాయి.తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వివిధ మార్గాలలో ఆదాయం సమకూరుతుంది. ఇది కన్యా రాశి వారికి నిజంగా శుభ ఫలితాలను ఇచ్చే మాసం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఏడాది చివరి రెండు నెలలు చాలా అద్భుతంగా గడవనున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. అదృష్టం వీరికి కలిసివస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కుంభరాశి
నవంబర్ మాసం కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే నెలగా చెప్పొచ్చు. ఈ సమయంలో కుంభ రాశి వారికి పురోగతి సాధ్యమవుతుంది. ఏలినాటి శని నుండి కుంభ రాశి వారికి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో అనేక శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో అన్నింట విజయాలను కుంభ రాశి వారు సొంతం చేసుకుంటారు.వర్తక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications