మాలవ్య రాజయోగం: ఈ రాశులవారికి రాజభోగాలు!!
గ్రహాల కదలిక అన్ని రాశుల వ్యక్తుల జీవితాలలో గణనీయమైన మార్పులకు కారణంగా మారుతుంది . తులా రాశిలో శుక్ర సంచారం, ధనుస్సు రాశిలో బుధ సంచారం ఫలితంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ మాలవ్య రాజయోగం వివిధ రాశుల వారికి రాజభోగాలను అందిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వేద జ్యోతిష్యశాస్త్రంలో మాలవ్య రాజయోగానికి చాలా విశిష్టత ఉంది. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటిగా చెప్పబడుతుంది.
మేషరాశి
మాలవ్య రాజయోగం వల్ల మేషరాశి వారి విశేషమైన ఫలితాలను పొందుతారు. మీరు ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు. ఆరోగ్య శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. సహోద్యోగుల నుండి పనిలో మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారు వివాహాలను ఖరారు చేసుకోవచ్చు. ఆర్థికపరమైన నిర్ణయాలలో తండ్రి సలహా తీసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో ఈ సమయం చాలా ఆనందంగా ఉంటుంది.

మిధునరాశి
మాలవ్య రాజయోగంతో మిధునరాశి వారికి లబ్ది చేకూరుతుంది. ఈ సమయంలో మిధునరాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామి అన్ని ముఖ్యమైన బాధ్యతలలో మీకు పూర్తిగా సహాయం చేస్తారు. మీ పిల్లలు మీకు సంతోషకరమైన వార్తలను అందిస్తారు. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ కలల ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీ సీనియర్ అధికారులు మీకు పనిలో సహాయం చేస్తారు.
కన్యారాశి
మాలవ్య రాజయోగం తో కన్యారాశిలో జన్మించిన వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కన్యా రాశిలో జన్మించిన వారు ప్రయాణాల వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయ వనరులు వైవిధ్యభరితంగా ఉంటాయి. మీరు గత పెట్టుబడుల నుండి ఎక్కువ రాబడిని ఈ సమయంలో అందుకోవచ్చు.
తులారాశి
మాలవ్య రాజయోగంతో తులా రాశిలో పుట్టిన వారికి ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం గురించి ఈ సమయంలో కొన్ని సానుకూల వార్తలను వినవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకునే సమయం. ఈ సమయంలో మీకు రుణ విముక్తి కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రత్యర్థులపై ఈ సమయంలో విజయం సాధిస్తారు.
మకరరాశి
మాలవ్య రాజయోగం తో మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృత్తిపరమైన కీర్తి కూడా పెరుగుతుంది. మకర రాశి వారు ఈ సమయంలో కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటే అవి ఈ సమయంలో తగ్గుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఎగుమతి దిగుమతి రంగంలో పనిచేస్తున్న వారు ఆకస్మిక లాభాలను పొందే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications