మాలికా రాజయోగం.. ఈ రాశులవారికి మహారాజయోగం
మిధున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుంభ రాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో బృహస్పతి, కన్యారాశిలో కేతువు ఉండడం వలన మాలికా రాజయోగం ఏర్పడింది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాలిక రాజయోగం చాలా శుభప్రదమైన, ఫలవంతమైన యోగంగా పరిగణించబడుతుంది.
మాలికా రాజయోగం
జాతకంలో ఒకదాని తర్వాత ఒకటి గ్రహాలు మాలలాగా ఏర్పడితే మాలికా రాజయోగం అంటారు. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అపారమైన విజయాలు వస్తాయి. వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి, ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిపై సంపద వర్షం కురుస్తుంది. ఇక మాలిక రాజయోగం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
మాలికా రాజయోగం కారణంగా మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో వీరికి పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారులకు సంబంధించి ఈ సమయంలో శుభవార్తలు వింటారు. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు సంతోషంగా బ్రతుకుతారు.
సింహరాశి
మాలికా రాజయోగం కారణంగా సింహరాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. సామాజికంగా పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి.
తులారాశి
తులారాశి వారికి మాలిక రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు అన్ని శుభ ఫలితాలను చూస్తారు. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆ కోరిక తీరుతుంది. ఉద్యోగంలో ఎదగాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ సమయంలో వస్తు సౌకర్యాలు పెరుగుతాయి. ధనానికి లోటు లేకుండా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications