ఫిబ్రవరి 23న కుంభరాశిలో మంగళాదిత్య యోగం.. వీరికి తిరుగే లేదు!
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11:49 నిమిషాలకు కుజుడు శని రాశి అయిన కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. అదే సమయంలో అక్కడ సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువులు కూడా ఉంటారు. ఈ ఐదు గ్రహాల కలయిక పంచగ్రాహి యోగాన్ని ఏర్పరచటంతో పాటు, కుజ సూర్య సంయోగం కారణంగా మంగళాదిత్య యోగం ఏర్పడుతుంది. మంగళాదిత్య యోగంతో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు వస్తాయి.
మేషరాశి
మంగళాదిత్య యోగంతో మేష రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. మేష రాశికి అధిపతి అంగారకుడు కావడం వల్ల వీరికి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో మేషరాశి వారికి సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభాలు వస్తాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి మంగళాదిత్య యోగంతో అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది. కుజుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల వీరికి కెరీర్లో పురోగతి లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయం, పెరిగిన ఖర్చులు అధికమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో మెరుగైన లాభాలను పొందుతారు.
సింహరాశి
సింహ రాశి వారికి మంగళాదిత్య యోగంతో అన్ని విధాల మంచి జరుగుతుంది. సింహరాశి జాతకులు కుజుడి ప్రభావంతో చేపట్టే పనులలో సానుకూల ఫలితాలను చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మంచి జరుగుతుంది. ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు లభించడంతోపాటు, కెరీర్లో పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు మంగళాదిత్య యోగం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ధనుస్సు రాశిలో మూడవ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల పెట్టుబడుల మీద మంచి రాబడిని ఆశించవచ్చు. ఈ సమయంలో చేపట్టే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయంతో పాటు, ఖర్చులను నియంత్రించుకోవడం మేలు చేస్తుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి మంగళాదిత్య యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి విజయాలను సాధిస్తారు. కుంభ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. కుంభరాశి వారి పనులు సకాలంలో పూర్తవుతాయి. అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications