స్వాతి నక్షత్రంలోకి కుజుడు.. త్వరలో ఈ రాశులకు అఖండ ధనయోగం!
జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజుడు త్వరలో నక్షత్రాన్ని మార్పు చేయబోతున్నాడు. కుజుడు మాత్రమే కాదు నవగ్రహాలు కూడా వివిధ రాశులతో పాటు నక్షత్రాలను కూడా మార్పు చేస్తూ సాగుతాయి. సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు రాత్రి 9 గంటల 8 నిమిషాలకు కుజుడు స్వాతి నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు.
కుజుడి నక్షత సంచారం.. అదృష్ట రాశులు
స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. కుజుడి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశులవారికి అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఇది వీరికి ఆర్ధిక ప్రయోజనాలను ఇస్తుంది. కుజుడి నక్షత్ర సంచారంతో లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
కుజుడు స్వాతి నక్షత్ర సంచారం చేయడం వల్ల సింహరాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. వీరిలో ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. ఎప్పటి నుండో తీరని కోరికలు ఈ సమయంలో తీరుతాయి. ఇది సింహ రాశి వారికి అదృష్ట సమయం.
కన్యారాశి
కన్యా రాశి వారికి కుజుడి నక్షత్ర సంచారం లాభాలను తీసుకువస్తుంది. కన్యారాశి జాతకులు ఆర్థికంగా సంతోషంగా జీవిస్తారు. ఈ రాశి వారు కుజుడి నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వీరి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు స్వాతి నక్షత్రంలో కుజ సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు కొత్త ఆస్తులను లేదా వాహనాలను కొనుగోలు చేయడానికి బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. ధనస్సు రాశి వారు చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో మీరు చేసే పనిని తోటి ఉద్యోగులు మెచ్చుకుంటారు. ధనుస్సు రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications