తులారాశిలో కుజుడు-కేతువు సంయోగం: అక్టోబర్ లో ఈ రాశులవారి పంట పండినట్టే!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క రవాణా, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అక్టోబర్ నెలలో కొన్ని ముఖ్య గ్రహాలు వివిధ రాశుల లోకి ప్రయాణం చేయడం వల్ల, కొన్ని ముఖ్యమైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం చేకూరుతుంది.

తుల రాశిలో కుజుడు, కేతువు సంయోగం
అక్టోబర్ నెలలో కుజుడు, కేతువు సంయోగం తులారాశిలో సంభవించనుంది. తుల రాశిలో కుజుడు, కేతువు సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి లబ్ది జరుగుతుంది. వచ్చే నెలలో వారు ఆర్థిక శ్రేయస్సును, సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Mars-Ketu conjunction in Libra: Super lucky for these zodiac signs!!

కన్యారాశి
తులా రాశిలో కుజుడు, కేతువు కలయిక వలన కన్య రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి జాతకులకు ఈ సమయం గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇంటి విషయంలో సమస్యలు దూరమై, ఆందోళనలు తగ్గే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం. కళాత్మక రంగాలలోని వారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది.

సింహరాశి
తుల రాశిలో కుజుడు, కేతువు సంయోగం వల్ల సింహ రాశి వారికి లాభిస్తుంది. సింహరాశిలో జన్మించినవారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి వ్యక్తుల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి మీ సామర్థ్యం మెరుగుపడేందుకు ఇది సరైన సమయం. మీ కెరీర్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. రోజువారి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. రాజకీయరంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను సాధిస్తారు.

మకర రాశి
తులారాశిలో కుజుడు కేతువు కలయిక వలన మకర రాశి జాతకులకు మేలు జరుగుతుంది. వీరి సంపాదన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన మార్పు గురించి ఆలోచించేవారు, కొత్త బిజినెస్ అన్వేషించే వారు ఈ సమయంలో వాటిని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు గణనీయమైన లాభాలను సాధిస్తారు. ఆస్తులు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది పెట్టుబడులకు అనుకూలమైనటువంటి కాలం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+