త్వరలో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులవుతారన్న కుజుడు!
జ్యోతిష శాస్త్రంలో కుజుడికి ఉండే ప్రాధాన్యత ప్రత్యేకమైనది. జూలై నెలలో గ్రహాలు రాశి మార్పులు సంభవించే సమయం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇదే క్రమంలో కుజ గ్రహం జూలై 28వ తేదీన బుధుడి రాశి అయిన కన్య రాశిలోకి ప్రవేశించడం వల్ల అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం పడుతుంది.
కన్య రాశిలోకి కుజుడు.. ఈ రాశులదే అదృష్టం
జూలై 28న కన్య రాశిలోకి ప్రవేశిస్తున్న కుజుడు సెప్టెంబర్ 13 వరకు అక్కడే ఉండి తన సంచారాన్ని కన్య రాశి లోనే కొనసాగిస్తాడు. గ్రహాల కమాండర్ గా పిలవబడే కుజుడు ప్రభావం కారణంగా కొన్ని రాశులకు తీవ్ర నష్టాలు వస్తే మరికొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ప్రయోజనాలు పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశిలో కుజుడు 8వ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు. కర్కాటక రాశిలో సంచ్శ్రించే సమయంలో మేషరాశిలో కుజుడు ఆరవ ఇంట్లో సంచరించడం వల్ల, కుజ సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుజ సంచారం కారణంగా మేష రాశి జాతకులకు కలిసి వస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ సమయంలో శత్రువులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఎవరితోనైనా వాదనలు లేదా గొడవలకు దిగకుండా మేష రాశి వారు గౌరవంగా జీవిస్తారు.
కర్కాటక రాశి
కుజ గ్రహ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి శుభాలు జరుగుతాయి. కన్యా రాశిలో కుజ సంచారం జరుగుతున్న సమయంలో కర్కాటక రాశిలో కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు. కుజ సంచారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి డబ్బుల లాభాలు కలుగుతాయి. వివిధ పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు .పిల్లల నుండి శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి
కుజుడు వృశ్చిక రాశి వారికి లగ్నానికి మరియు ఆరవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. కుజుడు వృశ్చిక రాశిలో లాభ స్థానంలో ఉంటాడు. దీంతో కుజుడు వృశ్చిక రాశి వారికి ఆదాయ స్థాయిలు పెరిగేలా చేస్తాడు. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి లాభాలు పొందుతారు. వివిధ రకాల వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాల్లో శుభ ఫలితాలు వస్తాయి. రియల్టర్లు వివిధ పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు. శత్రువులను ఈ సమయంలో సమర్ధవంతంగా ఎదుర్కొంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications