జనవరి వరకు వీరికి సంపదలు, రాజభోగాలతో ఊపిరాడనివ్వమన్న బుధ, గురులు!
వేద జ్యోతిష్య శాస్త్రం గ్రహాల గమనం మీద ఆధారపడి ఉంటుంది. గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితం అవుతుంది. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక వృషభ రాశిలో గురు సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉన్న బుధుడితో, వృషభ రాశిలో ఉన్న గురువు సంచారం కారణంగా ఈ రెండు గ్రహాల మధ్య సంసప్తక దృష్టి ఏర్పడింది.
బుధ గురు గ్రహాల సంసప్తక దృష్టి
దీని ప్రభావం జనవరి 4 వరకు ఉంటుంది. ఇది శుభ ఫలితాలను అందించే యోగానికి కారణం అవుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఆదాయ వృద్ధితో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ గురు బుధ సంసప్తక దృష్టి కారణంగా లబ్ధిని పొందే ఆయా రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి
గురు బుధుల సంసప్తక దృష్టి కారణంగా వృషభరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జనవరి 4 వరకు వీళ్ళు అనుకున్న పనులన్నీ తప్పక పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఆర్ధికంగా ఇది మీకు తిరుగులేని సమయం. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది శుభ సమయం. ఆదాయం పెరుగుతుంది. ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి.
కర్కాటక రాశి
బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా కర్కాటక రాశి వారికి లబ్ది జరుగుతుంది. వీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవారికి గుర్తింపు లభిస్తుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో సంతోషంగా ఉంటారు.
సింహరాశి
బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా సింహరాశి వారికి రాజయోగం సిద్ధిస్తుంది. సింహరాశి వారు ఈ సమయంలో ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇది సింహరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం. నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఆర్ధికంగా ప్రయోజనాలు కలుగుతాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు. ఏ పనులు తలపెట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. పెళ్లి కానివారికి వివాహ యోగం ఉంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్ధికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ సమయంలో మకర రాశి వారికి వర్తక, వ్యాపారాలలో ఊహించని పురోగతి ఉంటుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసిస్తుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
మీనరాశి
బుధ గురుల సంసప్తక దృష్టి మీన రాశి వారికి శుభాలను కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్ని విధాలుగా ఇది మీనరాశి వారికి శుభ సమయం. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఆకస్మిక ధన లాభాలు పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications