2025లో వీరే కుబేరులు... రాసి పెట్టుకోమన్న బుధ రాహువులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి సంవత్సరం జరిగే గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జాతకాలను నిర్ణయిస్తుంది. 2025 సంవత్సరం గ్రహాలపరంగా చాలా ప్రత్యేకమైన సంవత్సరం . ఈ సంవత్సరంలో అనేక గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మార్పు చెందుతూ ద్వాదశ రాశుల వారి జాతకాలను నిర్ణయిస్తాయి. ఈ మార్పు అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
మీనరాశిలో బుధ రాహువులు
ప్రస్తుతం రాహువు మీనరాశిలో ఉన్నాడు. ఇక 2025 ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో బుధుడు రాహువు కలయిక వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. మీనరాశిలో బుధ, రాహువుల కలయిక కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
బుధుడు రాహువు కలయిక కారణంగా వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. బుధ రాహువుల సంయోగ ప్రభావం వల్ల వృషభ రాశి జాతకులు ధన లాభాలను పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడి అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో భూములు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.
తుల రాశి
2025 సంవత్సరంలో బుధ రాహువుల కలయిక కారణంగా తులా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి జాతకుల వర్తక వ్యాపారాలు బాగా సాగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. తులా రాశి వారి ప్రేమ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇది తులా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
వృశ్చిక రాశి
బుధుడు రాహువు సంయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలవులవుతాయి. ఆరోగ్య పరంగాను వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో వీరు జీవితాన్ని సంతోషంగా సాగిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications