Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

3 దశాబ్దాల తర్వాత బుధ, శని గ్రహాల సంయోగం... వీరికి సంపదల ఖజానా!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు, గ్రహాల సంయోగాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఇవి వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలకు కారణమవుతాయి. ఇక ఈ ఫిబ్రవరి మాసంలో బుధ శని సంయోగం సరిగ్గా సున్నా డిగ్రీల వద్ద జరిగింది. ఫిబ్రవరి 25 వ తేదీన బుధ శని సంయోగం జరిగింది.

బుధ శని సంయోగం
జ్యోతిష శాస్త్రంలో బుధుడు మరియు శని స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండడం వల్ల ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మూడు దశాబ్దాల తర్వాత కుంభరాశిలో బుధ,శని గ్రహాల సంయోగం జరిగింది. దీనివల్ల లబ్ధిని పొందుతున్న ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Mercury and Saturn conjunction after 3 decades a treasure trove of wealth for them

కన్యారాశి
కన్యా రాశి వారి ఆరవ ఇంట్లో బుధ శని సంయోగం కారణంగా వారికి కలిసొస్తుంది. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. ప్రత్యర్ధులను ఓడిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారు ముఖ్యమైన ప్రాజెక్టులలో విజయాలను సాధిస్తారు. ఆర్థిక వృద్ధిని సాధిస్తారు .పదోన్నతులు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి
మూడు దశాబ్దాల తర్వాత బుధ శని సంయోగం కారణంగా మకర రాశి వారికి ఆర్దిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశిలో ధన గృహంలో బుధ, శని సంయోగం జరగడం వల్ల మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు వివాహ బంధాలు మెరుగుపడతాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మూడు దశాబ్దాల తర్వాత జరుగుతున్న బుధ, శని సంయోగం సత్ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశిలో నాలుగవ ఇంట్లో బుధ,శని సంయోగం జరగడం వల్ల వీరు సానుకూల ఫలితాలను సాధిస్తారు. వృశ్చిక రాశి వారు ఆస్తులను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో ఈ సమయం బాగా పనికొస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+