మేషరాశిలో బుధగ్రహ దహనం.. ఈ రాశులవారికి ప్రేమ, దాంపత్య జీవితంలో కష్టాలు!!
ఒక రాశి నుండి మరొక రాశిలోకి గ్రహ సంచారాలు, గ్రహాలు దహనాలు, పెరుగుదల వంటి కారణాలు, గ్రహ సంయోగాలు అన్ని రాశులవారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. త్వరలో మేషరాశిలో బుధగ్రహ దహనం జరగబోతుంది. ఏప్రిల్ నాలుగవ తేదీన ఉదయం 10:36 నిమిషాలకు మేష రాశిలో బుధుడు దహనం అవుతాడు. అయితే మేషరాశిలో బుధ దహనం వల్ల ముఖ్యంగా కొన్ని రాశులవారి జీవితాల్లో ప్రేమ, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మేషరాశి
మేష రాశిలో బుధుడు దహనం కారణంగా మేషరాశి వారి జీవితంలో కలహాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితం విభేదాల కారణంగా నిరాశ జనకంగా మారుతుంది.ఈ సమయంలో మాట్లాడే మాటల విషయంలో అదుపు అవసరం.

వృషభరాశి
మేషరాశిలో బుధ దహనం వృషభ రాశి వారి కుటుంబ జీవితంలో వివిధ సమస్యలకు కారణమవుతుంది. జీవిత భాగస్వామితో సమన్వయం తక్కువగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రేమరాహిత్యం కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే సహనాన్ని కోల్పోతారు .
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారు మేషరాశిలో బుధ దహనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి .ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఘర్షణ పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో కూడా కర్కాటక రాశి వారు సంయమనంతో ప్రవర్తించాలి. ఈ సమయంలో అహంకార సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఈ సమయంలో రెస్పాండ్ కాకుండా ఉండడం మంచిది.
మకరరాశి
మకర రాశి వారికి కూడా మేషరాశిలో బుధ దహనం కుటుంబ సమస్యలకు కారణమవుతుంది. ప్రేమ సంబంధంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గి జీవిత భాగస్వామితో విభేదాలను పెద్దది చేసుకుంటారు. ఇప్పుడు మాట్లాడే మాటల విషయంలో సంయమనం అవసరం. అనవసరపు గొడవలు జరిగే అవకాశం ఎక్కువ.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి మేషరాశిలో బుధ దహనం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. జీవిత భాగస్వామితో గొడవలకు దిగుతారు. ఇద్దరి మధ్య ఈగో ఘర్షణలకు కారణం అవుతుంది. దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు ఉండవు. ప్రేమ సంబంధాలు దెబ్బతింటాయి. అనవసరపు అపార్ధాలు పెరిగి పెద్దవి అవుతాయి.
తులారాశి
తులా రాశి వారికి మేషరాశిలో బుధ దహనం మనస్పర్థలకు కారణమవుతుంది. జీవిత భాగస్వాముల మధ్య సమన్వయం లోపించి, ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే?












Click it and Unblock the Notifications