మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
మీన రాశిలో బుధ గ్రహం నేడు సాయంత్రం 5 గంటలకు 49 నిమిషాలకు ప్రత్యక్షం కాబోతుంది. మీన రాశి బుధ గ్రహం యొక్క అత్యల్ప రాశిగా పరిగణించబడుతుంది. మీన రాశిలో బుధుడు ప్రత్యక్షం కారణంగా కొన్ని రాశుల వారు కెరీర్ లో సమస్యలను ఎదుర్కొంటారు . మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మీన రాశిలో బుధుడు ప్రత్యక్షం కారణంగా మేష రాశి వారు ఉద్యోగాలలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం కష్టంగా మారుతుంది. మీ పురోగతికి, ఆదాయవృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తుంది. మీరు ఉద్యోగాలు మారే అవకాశాలు లేకపోలేదు. అయితే అవి కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వవు. కాబట్టి ఈ సమయంలో ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి
మీన రాశిలో బుధుడు ప్రత్యక్షం కావడం సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రయోజనాన్ని కలిగించదు. ఉద్యోగ, వృత్తి జీవితంలో ఆశించిన ఫలితాలు ఉండవు. ఈ కాలంలో మీ పెరుగుదల నెమ్మదిస్తుంది. అడుగడుగునా అవంతరాలు చోటు చేసుకోవడంతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరు. వృత్తిపరమైన ఆశయాలను నెరవేర్చడానికి మీ దృష్టిని పూర్తిగా వెచ్చించినప్పటికీ ఫలితం ఉండదు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి ఉద్యోగ జీవితం మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం కారణంగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగం మారే ప్రమాదం ఉంది. ఇది మీకు అసౌకర్యాన్ని, అసంతృప్తిని కలిగిస్తుంది. ఉద్యోగ జీవితంపై మీకు ఆందోళన కలుగుతుంది. మీరు ఎంత కష్టపడినా అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందలేరు. మీ ఉద్యోగ జీవితం మీకు అసంతృప్తిని కలిగిస్తుంది.
కుంభరాశి
మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం కారణంగా కుంభరాశి వారు కెరీర్లో విజయం సాధించడానికి అవిశ్రాంతంగా పనిచేయాలి. ఈ సమయంలో మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు వారితో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. ఇది మీ పనిపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు కార్యాలయంలో ఎవరితోనూ జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా అది ప్రశంసలు అందుకోదు. కష్ట సమయాలను అధిగమించిన తర్వాత మీకు అంతా మంచే జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications